యూపీ పోలీసులు వేధించారు..

– తీవ్రవాదులతో సంబంధాలున్నాయని ఒప్పుకోవాలని బలవంతపెట్టారు..
– హత్రాస్‌ లైంగికదాడి ఘటన దృష్టి మరల్చేందుకే ఇదంతా : జర్నలిస్టు సిద్దికీ కప్పన్‌
– నాపై మోపిన ఆరోపణలకు ఆధారాల్లేవు..
– బెయిల్‌ లభించటం.. పూర్తి న్యాయం కాదు..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తనను తీవ్రంగా వేధించారని మలయాళ జర్నలిస్టు సిద్దికీ కప్పన్‌ ఆరోపించారు. మావోయిస్టు, తీవ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని ఒప్పుకోవాలని పోలీసులు బలవంత పెట్టారని, ఒప్పుకోకపోయేసరికి తీవ్రంగా కొట్టారని తాజాగా మీడియాతో మాట్లాడుతూ కప్పన్‌ చెప్పారు. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా మీడియాతో మాట్లాడుతూ కప్పన్‌ పై వ్యాఖ్యలు చేశారు. బెయిల్‌ నిబంధనల్లో భాగంగా ఆయన ఆరు వారాలు ఢిల్లీలో ఉండాల్సి వస్తోంది. పోలీస్‌ కస్టడీలో తాను ఎదుర్కొన్న వేధింపులు, ఇతర విషయాలు మీడియాకు తెలిపారు. కప్పన్‌పై యూపీ పోలీసులు నమోదుచేసిన కేసులో సెప్టెంబర్‌ 2022లో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరుచేసింది. కేంద్రం కప్పన్‌పై ఈడీ కేసు నమోదుచేసింది. ఆయన కుటుంబం ఎంతో శ్రమకోర్చి చేసిన పోరాటం ఫలితంగా చివరికి ఈడీ కేసులోనూ కప్పన్‌కు బెయిల్‌ దక్కింది. ఫిబ్రవరి 2న జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తూ, పోలీస్‌ కస్టడీలో తాను ఎదుర్కొన్న వేధింపుల్ని మీడియాకు వివరించారు.
”పాకిస్తాన్‌కు ఎప్పుడైనా వెళ్లావా? బీఫ్‌ (ఆవు మాంసం) తిన్నావా? అంటూ అనవసర ప్రశ్నలతో మానసికంగా వేధించారు. పోలీసు కస్టడీలో భయంకరమైన వేధింపులు ఎదుర్కొన్నా. సుప్రీంకోర్టు కలుగుజేసుకొని బెయిల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాను. బెయిల్‌ లభించటంతో పూర్తి న్యాయం దక్కిందని భావించటం లేదు” అని అన్నారు.
43ఏండ్ల సిద్దికీ కప్పన్‌ మలయాళ మ్యాగజైన్‌ విలేకరి. పార్లమెంట్‌, కాంగ్రెస్‌, మైనార్టీల వ్యవహారాలపై వార్తలు రాస్తుండేవారు. హత్రాస్‌లో దళిత యువతిపై లైంగికదాడి, హత్య ఘటన రిపోర్ట్‌ చేయడానికి అక్టోబర్‌, 2020లో ఉత్తరప్రదేశ్‌ వెళ్లాడు. అక్కడ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కప్పన్‌ను అరెస్టు చేసి, మావోయిస్టు, తీవ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని ఆరోపణలు నమోదుచేసింది. కేంద్రం మనీ లాండరింగ్‌ కేసు పెట్టింది. రెండు సంవత్సరాలా నాలుగు నెలలపాటు జైల్లో నిర్బంధించింది. తనపై వచ్చిన ఆరోపణల్ని కప్పన్‌ ఖండించారు. ఆరోపణలపై మాట్లాడుతూ, ”హత్రాస్‌ కేసులో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపెట్టడానికి నన్ను బలిపశువు చేశారు. ప్రజల దృష్టి మరల్చడానికి నాపై లేనిపోని ఆరోపణలు చేశారు. దళిత యువతిపై గ్రామంలోని పెత్తందార్లు అత్యంత పాశవికంగా లైంగికదాడికి తెగబడటమేగాక, హత్య చేశారు. దీనికి మతం రంగు పులిమేందుకు యూపీ సర్కార్‌ ప్రయత్నించింది” అని అన్నారు.

ఆధారాల్లేని ఆరోపణలు
నాపై మోపిన ఆరోపణలన్నీ ఆధారాల్లేనివి. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ), మావోయిస్టు, ఇతర తీవ్రవాద గ్రూపులతో సంబంధాల్లేవు. జర్నలిస్టు ముసుగు వేసుకున్నాడనే ఆరోపణ చేశారు. ఎప్పట్నుంచో కేరళ యూనియన్‌ ఫర్‌ వర్కింగ్‌ జర్నలిస్టు సభ్యుడ్ని. గుర్తింపు కార్డుల్ని లాక్కొని, పోలీసులు ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు. అనవసరమైన ప్రశ్నలతో పోలీసులు వేధించేవారు. అనేకమార్లు కొట్టారు. కాళ్లపై, పాదాలపై తీవ్రంగా కొట్టారు. మావోయిస్టు, తీవ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని ఒప్పుకోవాలని బలవంతపెట్టారు. అనారోగ్యం పాలైతే సరైన వైద్య చికిత్స దొరకలేదు. చేతికి బేడీలు వేసి హాస్పిటల్‌లో ఉంచారు. ఏడురోజులు వాష్‌రూమ్‌కు వెళ్లనీయలేదు. ప్లాస్టిక్‌ బాటిల్‌లో మూత్ర విసర్జన చేయాల్సి వచ్చింది.

Spread the love
Latest updates news (2024-05-24 13:37):

djP low blood sugar covid 19 | hot peppers lower blood sugar hun | lower blood G2a sugar without insulin | blood sugar test measurements 2we | blood sugar vCE after eat 129 | free blood sugar mUM readings chart | blood sugar neuropathy cbd vape | dr oz how to lower usd blood sugar | blood uDT sugar when waking up | Ppj blueberries help blood sugar | food EUA to decrease high blood sugar | blood sugar gX1 level application | how ce3 high blood sugar before going to hospital | how to bring up blood sugar quickly EBx | best to check wpV blood sugar | how to increase low blood BUU sugar levels | s6o can a panic attack increase blood sugar | 3IY blood sugar level 154 after eating | aspartame affect i6T on blood sugar | does artificial sweeteners lower blood 7WO sugar | is nIl hibiscus tea good for blood sugar | hemoglutrix CQw blood sugar gummies bears | low blood sugar after changing cvU diet | drinking 0dN alcohol lower blood sugar | child low blood sugar yaI | 3Uj can blood sugar levels affect body temperature | 150 blood sugar level fasting 4Kw | does artificial sweetener make your blood sugar m6j | normal blood sugar JWU philippines | how do you test a dog JkL blood sugar at home | coconut sugar affect blood sugar p3l | what will help lower blood xDG sugar | can random blood sugar test be wrong G9W | what f6x is related in regulating blood sugar levels | Qq1 which blood sugar reading is most important | what is an6 blood sugar range for diabetes | honey as bad rNJ as sugar for blood health | blood sugar after Xbo meal diabetes | what is normal blood HJn sugar level when you wake up | is EU5 blood sugar level of 60 safe | blood sugar range pp YOV | x7o fasting blood sugar test method | if blood sugar is high how do P3l you feel | does drinking EXk alcohol decrease blood sugar | mensral cramps and a5h loe blood sugar symptoms | blood sugar 20 jiw and low phosphorus | can low blood sugar 8Wz cause atrial fibrillation | normal blood Hs4 sugar level after meals | will controling blood rnD sugar prevent neuropathy | blood sugar high should bAx i eat