సినీ ఘనుల నిష్క్రమణ

         గత కొద్ది కాలంగా సినిమారంగ ప్రముఖులు అనేకమంది సెలవంటూ వెళ్లిపోతున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ మరణించిన కొద్ది రోజులకే కైకాల సత్యనారాయణ నిష్క్రమించారు. మొన్న సినీ సత్యభామ జమున, నిన్న కళాదర్శకుడు కె. విశ్వనాథ్‌ మృతి చెందగా, ఇప్పుడు అకస్మాత్తుగా మధురస్వరగాన వాణీ జయరాం వెళ్ళిపోయారన్న వార్త సినీరంగాన్ని ప్రేక్షకులనూ బాధకు గురిచేసింది. వీరంతా దాదాపు యాభైయేండ్లుగా అంతకుపైగా సినిమారంగంలో కళాత్మక సృజనతో కొనసాగినవారే. జేమ్స్‌ బాండ్‌ హీరోగా, మాస్‌ కథానాయకుడుగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కృష్ణ అల్లూరి సీతారామరాజుగా చెరగని ముద్రవేసిన నటుడు ఆయన. ఇక నవరసాలను పలికించగలిగి యముడంటే ఇలానే ఉంటాడనిపించిన సత్యనారాయణ విలన్‌గా, హాస్య నటుడుగా మెప్పించిన నటసార్వభౌముడు. సత్యభామ పాత్రలో తన సహజగుణ నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించి పేరు తెచ్చుకున్న జమున, ప్రజా కళాకారుడు గరికపాటిరాజారావు శిష్యరికంలో, అతను నిర్మించిన ‘పుట్టిల్లు’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి అనేక చిరస్మరణీయ పాత్రలలో తన నటనా కౌశలాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. వీళ్లంతా పాతతరం వాళ్లే. సినిమా రంగంలోనే కాదు, సమాజంలోనూ అనేక మార్పులు, ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఎంతో పెరిగింది. ఇప్పటి సినిమాతో పోల్చకపోయినా ఆనాటి చిత్రాల ప్రత్యేకత ఏమీ తక్కువ చేయలేము. సినిమా అనేది మన సామాజిక నేపథ్యాన్ని ప్రతిబింబిస్తూనే ఉంటుంది. దీంతో సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. రాజకీయ ఆర్థిక ప్రభావాలూ వాటిపై ఉంటాయి. జనం నాడిని పట్టుకోగలిగిన రచయితలు, దర్శకులు జనం ఆదరించే చిత్రాలను నిర్మించ గలుగుతారు. ఇంకొందరు సాధారణ ప్రజల హృదయాలను కదిలించే పనికి తమ కళను ఉపయోగించి చిత్రాలు తీస్తారు. ఇవి అనుభూతి ప్రధానంగా సాగుతాయి. ఇక జీవన వాస్తవికతలను చిత్రిస్తూనే ఉన్నత విలువలను, కర్తవ్యాలను కళాత్మకం చేస్తారు. ఇవి సామాజిక మార్పుల కోసం చైతన్యాన్ని అందిస్తూ ఉంటాయి. ఎన్ని రకాలుగా సినిమాలొస్తున్నా వాటిని ఏ విభాగానికి చెందిందో తేల్చేది కళా విమర్శకులు. కానీ సామాన్య ప్రేక్షకులు మాత్రం కళాసృజనకు ప్రియులుగానే ఉంటారు. అభిమానించే కథానాయకులు, నాయికలూ వారికుంటారు. ఆ చిత్రాలను రచించిన, దర్శకత్వం వహించిన వారిని గుర్తించడమనేది చాలా కాలం తర్వాతే జరిగింది. నటీనటులు ఎవరు అని గతంలో సినిమాలు చూసేవారు. ఇప్పుడు దర్శకులు ఎవరు అని తెలుసుకుని చూడటమూ జరుగుతోంది. ఇదొక పరిణామం.
కె. విశ్వనాథ్‌ సినిమాలు ఒక తరహా సినిమాలుగా ప్రసిద్ధి చెందినవి. కళాత్మక విలువలతో సినిమా తీస్తాడనే పేరువల్ల ఆయనను కళాతపస్వీ అని కూడా అంటారు. ‘శంకరాభరణం’ సినిమాతో తెలుగునేలపైనే కాదు, దేశం మొత్తంలోనే ఒక గొప్ప పేరును పొందారు. సంగీత ప్రాధాన్యాన్ని చిత్రీకరించిన సినిమా అది. మన సంప్రదాయ సాహిత్యమూ సంగీతమూ రెండూ కూడా ఆధ్యాత్మిక ధార్మిక సంబంధమైనవిగానే భావిస్తారు. ఆ రకమైన భావాన్నే ఆయన మరింత కళాత్మకంగా చిత్రీకరించారు. సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శృతిలయలు సినిమాలు కూడా సంగీత నృత్య ప్రధానమైనవే. ఇక సప్తపది, శుభసంకల్పం, శుభలేఖ, స్వయం కృషి, సూత్రదారులు మొదలైన చిత్రాలలో సామాజిక సమస్యలను కొంత చర్చించారు. ఇప్పుడున్న వ్యవస్థలోనే సంస్కరణ తేవాలన్న కోరిక తపన ఉన్న దర్శకుడుగా మనం విశ్వనాథ్‌ను చూడవచ్చు. వినసొంపైన సంగీతాన్ని, సాహిత్యాన్ని తిరిగి సినీరంగంలోకి తెచ్చినవాడు, సంప్రదాయ, సంస్కరణ కళా దర్శకుడు విశ్వనాథ్‌.
ఇక యాభైయేండ్ల పాటు వేయిసినిమాలలో పదివేల పాటలు పాడిన వాణీజయరాం (కలైవాణి) ఆకస్మిక మరణం సినీసంగీత రంగానికి లోటుగానే భావించాలి. విశ్వనాథ్‌ సినిమాలలో అనేక పాటలు పాడారీమె. ‘దొరుకునా ఇటువంటి సేవా’, ‘ఆనతి నీయవా హరా!’, ‘మానస సంచరరే..’, అందెల రవళిది పదమునదా’, ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీనాదీ…’ ‘ఒక బృందావనం – సోయగం’ మొదలైన ఎన్నోపాటలతో శ్రోతల అభిమానాన్ని పొందింది వాణీజయరాం. తమిళనాడులో జన్మించిన వాణి, ఉస్తాద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ ఖాన్‌ దగ్గర హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నారు. కర్నాటక సంగీతాన్ని అవపోసన పట్టారు. ముత్తుస్వామి దీక్షితార్‌ కీర్తనలను బాగాపాడగలిగిన ఆమె పద్దెనిమిది భాషలలో పాటలు పాడారు. ఆమె మొదటి సినిమా పాట హృషీకేష్‌ ముఖర్జీ సంగీత సారథ్యంలో ‘గుడ్డి’ సినిమాలోని ‘బోల్‌రే పప్పీ హరా!’ అనే పాటకు తాన్‌సేన్‌ సమ్మాన్‌ అవార్డు అందుకున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు జాతీయ అవార్డులందుకున్న ఆమెను పద్మభూషణ్‌ పురస్కారానికి ఇటీవలనే ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆమెది ఒక విభిన్నమైన కంఠస్వరం. పాటలున్నంత వరకూ ఆమెను తలచుకుంటూనే ఉంటాం. రెండు నెలల కాలంలోనే ఇందరు సినీ కళాకారులు మన నుండి దూరమయ్యారు. వారందరికీ కళాంజలి.

Spread the love
Latest updates news (2024-06-22 17:45):

how can you NwG check blood sugar | blood sugar g74 level 280 after eating | blood sugar 117 in morning OGb | supplement 5e3 that helps with blood sugar | what is normal range DDT for fasting blood sugar | eleveted G3V blood suger after drinking | low blood llG sugar mental illness | homeopathic materia medica P1E high blood sugar | Id3 blood sugar test app | can v3r temperature affect blood sugar | when RPb i fast my blood sugar goes up | can steroids raise blood 8N4 sugar levels | blood sugar test accuracy SxG | what does a blood sugar level of DW5 140 mean | how long fasting before U6j blood sugar test finger prick | how does aloe vera lower blood rmg sugar | where to get blood from dog nJO to test blood sugar | will fiber lower fo7 blood sugar | BYJ reason blood sugar does not drop below 100 | peanuts anS blood sugar control | blood on the 9Xq dance floor sugar rush lyrics | how to determine rsP blood sugar spikes | what is low x03 blood sugar range chart | can drinking beer 2Az lower blood sugar | does lemon balm cEV lower blood sugar | average healthy blood n9U sugar level | best way to raise tXO your blood sugar | what can make my blood faN sugar go up | can sugarfree cause blood yJp sugar | does pbc cause 5dI blood sugar problem | what causes blood sugar drops SXM | 2 hour blood BJ2 sugar 158 | will being sick affect my blood sugar 8Hb | food that do not 0uA spike blood sugar | is 150 too high dkR for blood sugar level | will bWG morphine sulfate raise blood sugar | gulf coast regional blood or7 center sugar land hours | fast drop in blood BkO sugar | zoD normal blood sugar one hour after eating | can 4rx a blood sugar medication cause a stomach pain | best time of Tv2 day for blood sugar test | can low blood sugar make XvW blood pressure go up | 96 fasting blood sugar sGF level | freestyle check blood sugar Jn4 lite | blood sugar chart CKw printable | does d5w raise ilu blood sugar | h00 blood sugar manual method | NnF free printable blood sugar sheets | how lwc to reset a blood sugar meter | sweets that djM don spike blood sugar