నామమాత్రంగా మండల సర్వసభ్య సమావేశం

– కోరం లేకున్నా కొనసాగుతున్న సర్వసభ్య సమావేశం
మండల సమస్యలపై అభివృద్ధిపై చర్చి ఉడదు.
– హాజరుకాని కొన్ని శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ కన్నాయిగూడెం
మండల పరిషత్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు మండల సర్వసభ్య సమావేశంలో మండల సమస్యలపై గాని అభివృద్ధి పైగాని సామగ్రంగా చర్చ జరిగిన దాఖలాలు లేవు దీనితో మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినవి, జరుగుతున్నాయో మండల ప్రజలకు తెలియదు. సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులకు, వచ్చిన నిధులపై ఖర్చు అయిన తీరుపై సమావేశంలో ఇప్పటివరకు ఎవరు అడిగి చర్చకు దారి తీసిన దాఖలాలు లేవు. దీనివల్ల సర్వసభ్య సమావేశం ప్రతిసారి నామమాత్రంగానే జరుగుతుంది. మండల సర్వసభ్య సమావేశంలో కొందరు అధికారులు మాత్రమే సమావేశం ఏర్పాటు చేసుకొని వారు మాత్రమే నామమాత్రంగా వివరాలు చెప్పుకొని గంట సమయంలోనే సర్వసభ్య సమావేశం ముగించుకుంటున్న పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి. ఇప్పటివరకు జరిగిన సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు అవి అమలు అయిన తీరు ఎవరికి తెలియవు. ఈ సమావేశంలో సమస్యలపై చర్చకు దారి తీసే నాయకులే మండలంలో కరువయ్యారు. మండల పరిషత్ వ్యవస్థలో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ నుండి ఎంపీటీసీలుగా ఉంటే, ఎక్కువ మొత్తంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో సర్పంచులు బీఆర్ ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు, గ్రామపంచాయతీ గురించి ఎంపీపీ గాని ఎంపీటీసీలు గాని చర్చించే ప్రస్తావన కోరవడితే, మండల పరిషత్ లోని అభివృద్ధి నిధుల గురించి చేసే పనుల గురించి సర్పంచులు అడిగే ప్రస్తావన లేదు. దీంతో మండలంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలిచే, పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా మండల సర్వసభ్య సమావేశాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసి మండలంలో వివిధ శాఖలు పనిచేస్తున్న తీరు వాటి అభివృద్ధి వచ్చిన నిధులు పై సామాగ్రమైనా చర్చ జరగాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.