రాజ్య‌స‌భ చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన  జ‌గ‌దీప్ ధంక‌ర్


న్యూఢిల్లీ:
పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భలు ఉద‌యం 11 గంట‌ల‌కు స‌మావేశం అయ్యాయి. రాజ్య‌స‌భ చైర్మెన్‌గా జ‌గ‌దీప్ ధంక‌ర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. స‌మావేశాల్లో మొద‌టి సారి ఆయ‌న చైర్‌లో కూర్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడారు. హౌజ్‌, దేశ ప్ర‌జ‌ల త‌ర‌పున చైర్మెన్‌కు కంగ్రాట్స్ చెబుతున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బ‌లు తిని మీరు ఈ స్థాయికి చేరుకున్నార‌న్నారు. స‌మావేశాలు ప్రారంభ‌మైన త‌ర్వాత లోక్‌స‌భ‌లో తొలుత ఇటీవ‌ల ప్రాణాలు కోల్పోయిన నేత‌ల‌కు నివాళులు అర్పించారు. ఆ త‌ర్వాత స‌భ‌ను 12 గంట‌ల‌కు వాయిదా వేశారు.