నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కష్ణ దర్శకుడు. రింకు కుక్రెజ సహ నిర్మాత. శుక్రవారం మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ మాటల తూటాలతో 100 శాతం వినోదం గ్యారెంటీ అనే నమ్మకం కలిగిస్తోంది. నాయకానాయికల మధ్య సన్నివేశాలు కూడా వినోదాన్ని పంచుతున్నాయి. అలాగే రూల్స్ రంజన్లా ఉండే మనో రంజన్ కాస్తా పబ్ రంజన్‌గా మారడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అసలు రూల్స్ రంజన్, పబ్ రంజన్‌గా ఎందుకు మారాడు? మందు వల్ల అతని ప్రేమకి, స్నేహానికి వచ్చిన సమస్య ఏంటి? అతని ప్రేమ ఫలించిందా? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తోంది ట్రైలర్. అమ్రిష్ గణేష్ పాటలలోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా తన ప్రతిభ కనబరుస్తున్నారు. అలాగే ట్రైలర్లో విజువల్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి. పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఈనెల 28న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా దులీప్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎం.సుధీర్ వ్యవహరిస్తున్నారు.