111 జీవో ఎత్తివేత హర్షణీయం

– ఎంపీ రంజిత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం జీవో 111ని ఎత్తివేయడం పట్ల చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యులు డాక్టర్‌ జి. రంజిత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 1996 లో హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ పరిరక్షణ కోసం అప్పటి ప్రభుత్వం 111 జీవో తెచ్చిందని పేర్కొన్నారు. 84 గ్రామాల్లో ఆంక్షలు అమలు అవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర మంత్రి మండలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.