హాస్టళ్లు,పీజీ వసతిపై 12శాతంజీఎస్టీ

బెంగళూరు .హాస్టల్‌ వసతిపై 12శాతం జీఎస్టీ చెల్లించాల్సిందేననిఅథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌(ఏఏఆర్‌)బెంగళూరు బెంచ్‌ తాజాగా తీర్పు వెలువరించింది.హాస్టళ్లు,పేయింగ్గెస్ట్‌,క్యాంపైట్లను నివాస గృహాలుగాపరిగణించలేమని స్పష్టంచేసింది.వాటినిర్వాహకులు నెల నెలా వసూలుచేసుకునే మొత్తంపై జీఎస్టీ తప్పకుండా చెల్లించాలని తెలిపింది.దీంతో హాస్టళ్లలో ఉండే వారిపై మరింతభారం పెరగనుంది.రోజుకురూ.వెయ్యి అంతకంటే ఎక్కువ వసూలు చేసేహాస్టళ్లు,పేయింగ్గెస్ట్‌ సముదాయాలు,క్లబ్బులు,హౌటళ్లనునివాస గృహాల కేటగిరీలోకి రావని ఏఏఆర్‌ బెంగళూరు బెంచ్తెలిపింది.అందువల్లవాటికి జీఎస్టీ నుంచి మినహాయింపుఇవ్వలేమని స్పష్టం చేసింది.ఈమేరకు శ్రీసాయి లగ్జరీయస్‌ స్టేఎల్‌ఎల్‌పీ కేసులో తీర్పువెలువరించింది. రోజుకురూ.వెయ్యివరకు చార్జి చేసే హౌటళ్లు,క్లబ్బులు,క్యాంప్‌సైట్లకు 2022జులై17వరకే జీఎస్టీ నుంచి మినహాయింపుఉందని ఏఏఆర్‌ పేర్కొంది.శాశ్వతనివాస సముదాయాలనే రెసిడెన్షియల్‌ యూనిట్లుగా పరిగణిస్తారనివివరించింది.హాస్టళ్లలోఉండే వారికి వంట,వసతివంటివి విడివిడిగా ఉండవని,ఉమ్మడిగాసదుపాయాలు కల్పిస్తూ నెలనెలా చార్జి చేస్తారనిగుర్తుచేసింది.దీంతోవాటిని నివాస గృహాలుగాగుర్తించలేమని ఏఏఆర్‌ వివరించింది.నోయిడాకుచెందిన వీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌అండ్‌ హాస్టల్‌ ప్రైవేట్‌లిమిటెడ్‌ కేసులోనూ ఏఏఆర్‌ లక్నో బెంచ్‌ ఇదే తరహా తీర్పునువెలువరించింది.అయితే,హాస్టల్వసతికి ఛార్జ్‌ చేసే మొత్తంరూ.వెయ్యికంటే తక్కువ ఉన్నప్పటిక ీజీఎస్టీ పరిధిలోకి వస్తుందనిస్పష్టం చేసింది.కాగా,హాస్టళ్లపై12శాతంజీఎస్టీ విధించడం వల్లవిద్యార్థులపై అదనపు భారంపడుతుందని ఏఎంఆర్‌జీ అం డ్‌అసోసియేట్స్‌ సీనియర్‌పార్ట్‌నర్‌ రజత్‌ మోహన్‌ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపైజీఎస్టీ కౌన్సిల్‌ పునరాలోచించాలనిఆయన విజ్ఞప్తి చేశారు.