మద్యం దుకాణాలకు 125 దరఖాస్తులు

–  ఈనెల 21న లాటరీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో 2023-24, 2024-25 రెండేండ్లకుగాను మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం ఆబ్కారీ శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. మొదటి రోజు 125 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 18వ తేది సాయంత్రం 6గంటలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 21న లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు 786 షాపులను ప్రత్యేకంగా కేటాయించారు. వీటిలో గౌడ కులస్తులకు 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 కేటాయించారు. ఎస్టీలకు కేటాయించిన వాటిలో 95 దుకాణాలు షెడ్యూల్‌ ఏరియాలో ఉన్నాయి. నాన్‌ షెడ్యూల్‌ ఏరియా గిరిజనులకు 36 దుకాణాలను కేటాయించారు. మిగిలిన 1834 మద్యం షాపుల లైసెన్స్‌ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.