కుక్కల దాడిలో 14 మేకలు మృత్యువాత

నవతెలంగాణ-షాబాద్‌
కుక్కల దాడిలో 14 మేకలు మృత్యువాత పడ్డాయి.ఈ ఘటన షాబాద్‌ మండల పరిధిలోని నాగర్‌కుంట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత రైతు, పశువైద్యాధికారి స్రవంతి తెలిపిన వివరాల మేరకు… నాగర్‌కుంట గ్రామానికి చెందిన కొత్త కురువ నరసింహులు తన మేకల మందను ఆదివారం సాయంత్రం పొలం వద్ద ఉంచి, ఇంటికి వచ్చాడు. ఆదివారం రాత్రి మేకల మందపై కుక్కలు దాడి చేసి, 14 మేకలపై దాడి చేసి, చంపివేసాయి. మరో 10 మేకలు తీవ్రంగా గాయపడ్డాయి. ఉదయం మేకల మంద వద్దకు వెళ్లిన రైతు కుక్కల దాడిలో మేకలు మృత్యు వాత పడిన ఘటనను చూసి బోరున విలపించాడు. సమాచారం తెలుసుకున్న షాబాద్‌ పశు వైద్యాధికారి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మేకల జీవనా ధారంగా బతుకుతున్న తనకు, ఆర్థిక సాయం చేసే ఆదుకో వాలని ప్రభుత్వాన్ని బాధిత రైతు వేడుకున్నాడు.