నవతెలంగాణ-గంగాధర: గంగాధర మండలం గట్టుభూత్కూర్ గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు మంజూరైన 16 లక్షల రూపాయల నిధుల ప్రోసీడింగ్ పత్రాన్ని ఆ గ్రామ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందించారు. గట్టుభూత్కూర్ గ్రామంలో వడ్డెర సంఘం భవనం, మహిళా మండలి భవనం, రెడ్డి సంఘ భవన నిర్మాణాలు, ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం 16 లక్షల రూపాయల నిధులను విడుదల చేస్తూ ప్రొసీడింగ్స్ అందించారు. ఈ సందర్బంగా సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి మాట్లాడుతూ నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మంజూరైన నిధులతో యుద్ధ ప్రాతిపదిక పనులు చేపట్టి సకాలంలో భవన నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ఉప సర్పంచ్ కాసారపు శైలజ, శ్రీకాంత్, వార్డు సభ్యులు, కో అప్షన్ సభ్యులతో పాటు ఒడ్డెర సంఘం సభ్యులు, రెడ్డి సంఘం సభ్యులు, యువకులు పాల్గొన్నారు.