నవతెలంగాణ-పాల్వంచ
జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించి బుధవారం 18 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. పినపాక నుంచి రెండు నామినేషన్లు, ఇల్లందు నియోజకవర్గం నుంచి మూడు, కొత్తగూడెం నుంచి ఆరు, అశ్వరావుపేట నాలుగు, భద్రాచలం మూడు నామినేషన్లు సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు స్వీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. పినపాక అసెంబ్లీ నియోజకవర్గం గుగులోత్ రమేష్ – విద్యార్థుల రాజకీయ పార్టీ, కోడెం వెంకటేశ్వర్లు స్వతంత్ర అభ్యర్థి, ఇల్లందు నియోజకవర్గం గుమ్మడ అనురాధ స్వతంత్ర అభ్యర్థి, బాణోత్ మోహన్ స్వతంత్ర అభ్యర్థి, బాణోత్ వెంకట్ ప్రవీణ్ కుమార్ నాయక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కొత్తగూడెం నియోజకవర్గం కటుకొజ్వల నాగేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థి, కొయ్యల సరిత స్వతంత్ర అభ్యర్థి, సనప కోటేశ్వర రావు స్వతంత్ర అభ్యర్థి, తల్లాడ వెంకటేశ్వర్లు అలియన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ పార్టీ, ఎర్రా కామేశ్వర్ బహుజన సమాజ్ పార్టీ, కూనంనేని సాంబశివరావు సీపీఐ, అజాం షేక్ స్వతంత్ర అభ్యర్థి, అశ్వారావుపేట వాసం పోల్లయ్య అబాద్ పార్టీ, పద్ధం వెంకట రమణ అలయెన్స్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫామ్స్ పార్టీ, జారే ఆదినారాయ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఊకే రవి గోడ్వాన దండకారణ్య పార్టీ, భద్రాచలం నియోజకవర్గం కుంజా ధర్మారావు బీజేపీ, కుంజా సంతోష్ కుమార్ బీజేపీ, కారం పుల్లయ్య సీపీఐ(ఎం) నామినేషన్లు దాఖలు చేశారు.