వీవోఏ ల సమ్మెకు సంపూర్ణ మద్దతు

– జారే ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
న్యాయమైన డిమాండ్ల తో చేపట్టిన వీవోఏల సమ్మెకు ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రధాన అనుచరుడు,ఈ నియోజక వర్గం ప్రతిపాదిత అభ్యర్ధి జారే ఆదినారాయణ ప్రకటించారు. వీవోఏ ల సమ్మె శుక్రవారం నాటికి 25 వ రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా సమ్మె శిభిరం వద్దకు చేరుకుని వారికి మద్దతుగా కూర్చున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ ఉద్యోగులకు అవి చేస్తా,ఈ ఉద్యోగులకు ఇవి చేస్తా అంటూ బూటకపు మాటలతో సీఎం కేసీఆర్ కాలం గడుపుతున్నారు అని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో జూపల్లి రమేష్,ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love