– జిల్లా ఎన్నికల అధికారి పీ. ఉదరుకుమార్
కందనూలు: నాగర్ కర్నూల్ జిల్లాలో 6వ రోజున మొత్తం 18 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి పీ. ఉదరు కుమార్ తెలిపారు. ఎన్నికల నామినేషన్ 6వ రోజున ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు సమర్పించారని తెలిపారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో 9 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా కొల్లాపూర్ నుంచి 4 అచ్చంపేట నుంచి 5 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి జాడి స్వామీ తండ్రి జాడి బక్కయ్య, బీఆర్ఎస్ నుంచి మర్రి జనార్ధన్ రెడ్డి (2) సెట్ల నామినేషన్లు వేయగా ఆయన సతీమణి మర్రి జమున బీ. ఆర్.ఎస్. తరపున ఒక సెట్ నామినేషన్ వేశారు. భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమ్యైక్యత కేంద్రం మార్కిస్ట్ లెనినిస్ట్ పార్టీ నుంచి కడుకుంట్ల జానకి రాంరెడ్డి, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూచకుళ్ల రాజేష్ రెడ్డి తరుపున కూచకుళ్ల దామోదర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ వేశారు. భారత సంయుక్త రాష్ట్రాల కమ్యునిస్ట్ పార్టీ నుంచి మిద్దె రాములు, స్వతంత్ర అభ్యర్తులుగా మూడవత్ బాలరాజు, చీమర్ల రాజేశ్వర్ రెడ్డి, నరిగే నరేందర్ లు నామినేషన్ వేశారు. అచ్చంపేట నుంచి దేవాని సత్యనారాయణ అలియాస్ దెవాని సతీష్ మాదిగ బీ.జే.పీి నుంచి నామినేషన్ వేశారు. ఎం. నాగార్జున్ బహు జన సమాజ్ వాది పార్టీ తరపున రెండు సెట్ల నామినేషన్ వేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున చిక్కుడు వంశీ కష్ణ, భారాస నుంచి గువ్వల బాలరాజు రెండు సెట్ల నామినేషన్లు వేశారు. ధర్మ సమాజ్ పార్టీ తరపున చింత సాయిబాబు నామినేషన్ వేసినట్లు తెలి పారు. కొల్లాపూర్ నుంచి 5 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో ఆదిసంధ్య రాణీ ధర్మ సమాజ్ పార్టీ, గగనం శేఖరయ్యా బీ.ఎస్.పీ , స్వతంత్ర అభ్యర్తులుగా కర్నే శిరీష, కాటగౌని తిరుపతమ్మ నామినేషన్లు వేసినట్లు తెలిపారు.