హైదరాబాద్‌లోని T-HUBలో 19వ IEEE ఆసియా-పసిఫిక్ కాన్ఫరెన్స్ ఇన్ సర్క్యూట్స్

– హైదరాబాద్లోని T-HUBలో 19 IEEE ఆసియాపసిఫిక్ కాన్ఫరెన్స్ ఇన్ సర్క్యూట్స్, సిస్టమ్స్ (APCCAS 2023) ప్రారంభించడమైనది.
నవతెలంగాణ – హైదరాబాద్:
IEEE ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆన్ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్స్ (APCCAS 2023) యొక్క 19వ ఎడిషన్‌కు ఆతిథ్యం ఇస్తున్నందున భారతదేశంలోని హైదరాబాద్ నగరం సాంకేతిక ఉత్సాహంతో కళకళలాడుతోంది. ఈ సంచలనత్మక సదస్సులో, మైక్రోఎలక్ట్రానిక్స్‌ పోస్ట్-గ్రాడ్యుయేట్ రీసెర్చ్ (PRIMEAsia 2023) అనుసంధానంతో నవంబర్ 19 నుండి 22 వరకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో ప్రారంభించడమైనది. T-HUB హైదరాబాద్ ఆకర్షణీయమైన ప్రారంభ వేడుకలకు వేదిక అయింది, సర్క్యూట్‌లు మరియు సిస్టమ్‌లలో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (VLSI)లో నాలుగు రోజుల పరిశోధన, సహకారం మరియు ఆవిష్కరణలను తెలియజేస్తుంది. మాజీ డిఫెన్స్ సెక్రటరీ డాక్టర్ అజయ్ కుమార్, ముఖ్య అతిథిగా మరియు గౌరవ అతిథిగా విచ్చేసిన AMS OSRAM సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రీనర్ జంపర్ట్జ్ అధికారికంగా ప్రారంభించడంతో ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేసారు. వారి ముఖ్య ప్రసంగాలు ఈవెంట్ ముఖ్య ఉద్దేశం తెలియచేయడమే కాకుండా పరిశ్రమ, విద్యాసంస్థలు మరియు పరిశోధకులలో సెమీకండక్టర్ల కలయిక యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కిచెప్పాయి. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో సెమీకండక్టర్ పరిశ్రమకు చెందిన ప్రముఖు శ్రేణి ఉత్పతులను ప్రదర్శించారు, ఇందులో AMS OSRAM, NXP సెమీకండక్టర్స్, మైక్రోచిప్, AMD, Mediatek, IMEC, సిలికాన్ ల్యాబ్స్, DRDO, DSCI మరియు డిజిటల్ యూనివర్శిటీ కేరళ, అనురాగ్ యూనివర్సిటీ, హైదరాబాద్ వంటి ప్రముఖ పరిశోధన మరియు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మేకర్ విలేజ్ కేరళ & టి-హబ్‌తో సహా స్టార్టప్ ఇంక్యుబేటర్లు. సెమీకండక్టర్ టెక్నాలజీలో సరికొత్త పురోగతులను, ఫీల్డ్‌లో జరుగుతున్న అత్యాధునిక పనులను  హాజరైన వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. APCCAS 2023 జనరల్ చైర్ డాక్టర్. గోవిందాచార్యులు, విద్యార్థులు మరియు నిపుణులకు ప్రపంచ ప్రఖ్యాత నిపుణుల మేధాస్సుల కలయిక ఈ సదస్సు ఒక అపూర్వ అవకాశంగా అభివర్ణిస్తూ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ ఆనందమోహన్, జనరల్ చైర్, మాట్లాడుతూ వైవిధ్యమైన కార్యక్రమంలో పరిశోధనా పత్రాల ప్రదర్శనలు, డిజైన్ పోటీలు, ట్యుటోరియల్స్, కీనోట్ టాక్స్ & ప్యానెల్ చర్చలు ఉంటాయన్నారు. జనరల్ చైర్ ప్రీత్ యాదవ్, తెలంగాణ ప్రభుత్వం అందించిన సహాయ సహకారాన్ని గుర్తిస్తూ చిరకాల స్వప్నం సాకారం కావడంపై మనోభావాలను పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15 కంటే ఎక్కువ దేశాల నుండి 280 సమర్పణలతో సదస్సుకు అద్భుతమైన స్పందన లభించిందని టెక్నికల్ ప్రోగ్రామ్ చైర్‌లు ప్రొఫెసర్ శాంతి పవన్ మరియు ప్రొఫెసర్ అలెక్స్ జేమ్స్ సూచించారు. IEEE హైదరాబాద్ విభాగం ఛైర్మన్ డాక్టర్ విజయలత, సర్క్యూట్‌ మరియు సిస్టమ్స్ డొమైన్‌లో సంస్థ యొక్క 75వ సంవత్సర వేడుకలను ఉటంకిస్తూ, IEEE చాప్టర్‌లు మరియు అనుబంధ సమూహాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆర్గనైజింగ్ చైర్ డాక్టర్ కృష్ణకాంత్, సర్క్యూట్‌ మరియు సిస్టమ్స్ ల్యాండ్‌స్కేప్‌లో కీలకమైన ఈవెంట్‌గా APCCAS 2023ని హైలైట్ చేసారు.  ఈ ప్రోగ్రామ్‌లో ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ట్రాక్‌లు మరియు ఉమెన్-ఇన్-సిఎఎస్ సెషన్‌లు, స్టార్ట్-అప్ ఫోరమ్ & రీసెర్చ్ ట్రాక్‌లు ఉన్నాయి. అద్భుతమైన సహకార ప్రయత్నానికి భారతదేశంలోని అన్ని IEEE సర్క్యూట్‌ మరియు సిస్టమ్స్ చాప్టర్‌లకు ధన్యవాదాలు తెలుపుతూ సెషన్‌ను ముగించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో డాక్టర్ అమర అమర, డాక్టర్ నిషియో, డాక్టర్ యోంగ్ఫు లి, డాక్టర్ ఫఖ్రుల్ జమాన్, డాక్టర్ సంతోష్ అనురాగ్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ అతుల్ నేగి, డాక్టర్ మౌస్మీ, డాక్టర్ జబ్బార్ మరియు డాక్టర్ జయప్రకాశన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నిపుణులు పాల్గొన్నారు. సర్క్యూట్‌ మరియు సిస్టమ్‌ల రంగంలో అసమానమైన సంఘటనకు వేదికను ఏర్పాటు చేయడమైనది. APCCAS 2023 ఆవిష్కృతమవుతున్నప్పుడు, ఇది VLSI సర్క్యూట్‌ మరియు సిస్టమ్‌లలో సహకారాన్ని పెంపొందించడం మరియు ఆవిష్కరణల సరిహద్దులను ముందుకు తెస్తుంది.