హైదరాబాద్ : చికాగో కేంద్రంగా పని చేస్తున్న కార్ కేర్ కంపెనీ టర్టిల్ వాక్స్ ఇంక్ తాజాగా తమ మరో కో-బ్రాండెడ్ కార్ కేర్ స్టూడియోని హైదరాబాద్లో ఉదరు ఆటో కేర్ భాగస్వామ్యంతో ప్రారంభించినట్లు ప్రకటించింది. ఎల్బి నగర్లో అత్యాధునిక టర్టిల్ వాక్స్ డిటైలింగ్ టెక్నాలజీలు, అధిక అర్హత కలిగిన, శిక్షణ పొందిన సేవా సిబ్బందితో కూడిన టర్టిల్ వాక్స్ కార్ కేర్ స్టూడియో వినియోగదారులకు కావాల్సిన విధంగా కార్ డిటైలింగ్ సేవలు, ఉత్పత్తుల యొక్క విస్తృత శ్రేణీని అందించనున్నట్లు టర్టిల్ వాక్స్ కార్ కేర్ ఇండియా ఎండి, సాజన్ మురళి పురవంగర, ఉదరు ఆటో కేర్ యజమాని ఉదరు భాస్కర్ తెలిపారు.