బీఆర్‌ఎస్‌ పార్టీకి 200 కుటుంబాలు రాజీనామా

నవతెలంగాణ-కామేపల్లి
కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు బిఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తామంతా డీసీసీబీ డైరెక్టర్‌ మేకల మల్లిబాబు యాదవ్‌ వెంట నడుస్తామని స్పష్టం చేశారు. రాజీనామా చేసిన వారిలో వార్డు మెంబర్లు తొండల ముత్తయ్య, మొగిలి విజయ, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ మేకపోతుల మహేష్‌ గౌడ్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు బానోతు నరసింహ నాయక్‌, గ్రామ పెద్దలు గుంటుపల్లి వెంకట్రావు, గిరిజన నాయకులు ధరావత్‌ హరిచంద్ర, బండి లష్మినర్సు, పల్లె ఉపేందర్‌ రావు, చల్ల వెంకన్న, బత్తుల రాంబాబు ( పెద్ద రాయుడు ), జలగం శ్రీను, బానోత్‌ లచ్చిరాం, తో పాటు 200 మంది యువకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పిఎస్‌ మండల అధ్యక్షుడు భూక్య నాగేంద్రబాబు, వార్డ్‌ మెంబర్‌ బానోతు లక్ష్మనాయక్‌, మాజీ సర్పంచ్‌ ధారావత్‌ లాలు, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు పాల్గొన్నారు.