బడులకు 229 పనిదినాలు

12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం
-9 వరకు బడిబాట నిర్వహణ
– వచ్చే ఏడాది ఏప్రిల్‌ 23 చివరి పనిదినొం అసెంబ్లీ అనంతరం రోజూ ఐదు నిమిషాలు యోగా
– అక్టోబర్‌ ఐదు నుంచి ఎస్‌ఏ-1, ఏప్రిల్‌ 4 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు
– పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల
పండుగ సెలవులు
దసరా సెలవులు అక్టోబర్‌ 13 నుంచి 25 వరకు (13 రోజులు)

క్రిస్మస్‌ సెలవులు (మిషినరీ స్కూళ్లకు) డిసెంబర్‌ 22 నుంచి 26 వరకు (ఐదు రోజులు)
సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17 వరకు (ఆరు రోజులు)
అకడమిక్‌ క్యాలెండర్‌లో ముఖ్యాంశాలు
 జూన్‌ 12 నుంచి బడులు పున:ప్రారంభం
 జులై 31 నాటికి ఎఫ్‌ఏ-1 పరీక్షలు
 సెప్టెంబర్‌ 30 నాటికి ఎఫ్‌ఏ-2 పరీక్షలు
 అక్టోబర్‌ 5 నుంచి 11 వరకు ఎస్‌ఏ-1 పరీక్షలు
 డిసెంబర్‌ 14 నాటికి ఎఫ్‌ఏ-3 పరీక్షలు
 జనవరి 29 నాటికి పది విద్యార్థులకు ఎఫ్‌ఏ-4 పరీక్షలు
 ఫిబ్రవరి 2 నాటికి 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ-4 పరీక్షలు
 ఏప్రిల్‌ 8 నుంచి 18 వరకు ఎస్‌ఏ-2 పరీక్షలు
 ఫిబ్రవరి 29కి ముందే టెన్త్‌ ప్రీ ఫైనల్‌
 మార్చిలో టెన్త్‌ పరీక్షలు
 స్కూళ్లకు చివరి పనిదినం ఏప్రిల్‌ 23
 ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరంలో పాఠశాలలకు మొత్తం 229 పనిదినాలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 23 పాఠశాలలకు చివరి పనిదినమని స్పస్టం చేసింది. బడిబాట కార్యక్రమాన్ని ఈనెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించాలని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను మంగళవారం విడుదల చేశారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులుంటాయని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి పదో తేదీ వరకు పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని కోరారు. వార్షిక పరీక్షల్లోపు ప్రీ ఫైనల్‌ పరీక్షలను పూర్తి చేయాలని సూచించారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 29 వరకు సిలబస్‌ను పూర్తి చేయాలని తెలిపారు. ఏప్రిల్‌లో జరిగే సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-2) పరీక్షల కోసం పునశ్చరణ తరగతులు నిర్వహించాలని కోరారు. పాఠశాలల్లో ప్రార్థన సమయంలో ప్రతిరోజూ ఐదు నిమిషాలు యోగా, ధ్యానం చేసేందుకు కేటాయించాలని పేర్కొన్నారు.
జులై 31 నాటికి ఎఫ్‌ఏ-1 పరీక్షలు
రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు జులై 31 నాటికి ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ-1) పరీక్షలను నిర్వహించాలని వాకాటి కరుణ తెలిపారు. సెప్టెంబర్‌ 30 నాటికి ఎఫ్‌ఏ-2 పరీక్షలు జరపాలని పేర్కొన్నారు. అక్టోబర్‌ ఐదు నుంచి 11 వరకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-1) పరీక్షలుంటాయని వివరించారు. డిసెంబర్‌ 14 నాటికి ఎఫ్‌ఏ-3 పరీక్షలుంటాయని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 29 నాటికి పదో తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ-4 పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి రెండో తేదీ నాటికి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ-4 పరీక్షలుంటాయని వివరించారు. ఏప్రిల్‌ ఎనిమిది నుంచి 18 వరకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ-2 పరీక్షలను జరుపుతామని తెలిపారు. ఫిబ్రవరి 29వ తేదీలోపు పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్‌ పరీక్షలను నిరవహిస్తామని పేర్కొన్నారు. మార్చిలో పదో తరగతి విద్యార్థులకువార్షిక పరీక్షలుంటాయని వివరించారు.