సందర్భోచితంగా జగన్‌ పాలనపై స్పందిస్తా

– మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సమయం, సందర్భం వచ్చినప్పుడు జగన్‌ పాలనపై స్పందిస్తానని మాజీ సీఎం ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డితో ఏపీ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. సుమారు మూడున్నర గంటల పాటు వారి సమావేశం కొనసాగింది. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధిష్టానం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ పనిచేయాలని సూచిస్తే అక్కడ పనిచేస్తానని చెప్పారు. తమ భేటీలో ఏపీలో బీజేపీని ఎలా బలోపేతం చేయాలనేే అంశంపై చర్చించామని చెప్పారు. తనకున్న అనుభవంతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. బీజేపీలో చేరాక నెల పాటు అమెరికా వెళ్ళాననీ, ఇకపై పార్టీ కార్యక్రమాల్లో బిజీ అవుతానని తెలిపారు. ఈ భేటీలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, కార్యనిర్వాహక కార్యదర్శి మధుకర్‌ పాల్గొన్నారు.

Spread the love