24 నుంచి ఎస్సెస్సీ హాల్‌ టికెట్లు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వచ్చే నెలలో నిర్వహించనున్న ఎస్సెస్సీ, ఓపెన్‌ ఎస్సెస్సీ, ఎస్సెస్సీ వొకేషనల్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను బోర్డు వెబ్‌ సైట్లో అందుబాటులో ఉంచినట్టు పాఠశాల విద్య సంచాలకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను 24 నుంచి డౌన్‌లోడ్‌ చేసు కోవచ్చని సూచించారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌పై ప్రధానోపాధ్యాయుని సంతకం లేకపోయినప్పటికీ పరీక్షకు అనుమతించబడుతారని స్పష్టం చేశారు. ఏవైనా అనుమానాలుంటే అభ్యర్థులు 90302 82993కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.