3 గంటలు కాదు 3 పంటలు ముద్దు

– అప్పటి ప్రభుత్వాలు వ్యవసాయం దండగ అన్నాయి
– ఇప్పటి ప్రభుత్వం వ్యవసాయమే పండగ అంటుంది
– రైతులను ఆదుకోవడమే బీఆర్‌ఎస్‌ లక్ష్యం ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌
నవతెలంగాణ-కోట్‌పల్లి
అప్పటి ప్రభుత్వాలు వ్యవసాయరంగం దండ గని రైతులను విద్యుత్‌ విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ అనేక విధాలుగా మోసం చేసి రై తులను పట్టించుకున్న పాపాన పోలేదని వికారాబా ద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్‌ మెతు కు ఆనంద్‌ అన్నారు. సోమవారం మండల పరిధి లోని రాంపూర్‌ రైతు వేదిక వద్ద రైతులతో విద్యుత్‌ సమస్యలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసుకోవడమే దండుగాని వ్యవసా యంలో ఎలాంటి లాభాలూ లేవని రైతులను చిన్న చూపు చూసి వ్యవసాయం దండుగా అన్న అప్పటి ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచాయన్నారు. అప్పుడు అలా ఉంటే బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తుంటే అది ఓర్వలేని ప్రతిపక్ష కాంగ్రెస్‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు 3 గంటల విద్యుత్‌ సరిపోతుం దని ఇప్పుడంటే ఒకవేళ అధికారంలోకి వస్తే 3 గం టలు కాదు మొత్తానికే ముప్పు జరుగుతుం దన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 3 పంటలు పెట్టుకోవచ్చంటే కాంగ్రెస్‌ 3గంటల విద్యుత్‌ సరిపోతుందనడం సరి కాదన్నారు. అంతకుముందు గత ప్రభుత్వాలు చేసి న అభివృద్ధి బీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమా లకు ఎలాంటి తేడా ఉందని రైతులతో మాట్లాడిం చారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవసాయరంగా నికి విద్యుత్తు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని వచ్చిన కొద్దిపాటి కరెం టు కూడా సరిగా లేకపోవడంతో మోటర్లు కాలి పొ య్యే అవకాశం ఉండేదని రైతులు తెలిపారు. బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రైతులు ఇబ్బంది పడకుండా రైతులను దృష్టిలో పెట్టుకుని 24 గంటల కరెంటుతో పాటు సరిపడా ఎరువులు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షు డు రాంరెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ ఎస్‌ మం డలాధ్యక్షుడు సుందరి అనీల్‌, స్థానిక సర్పంచ్‌ అనిత గోపాల్‌రెడ్డి, సర్పంచులు సంఘం మండలాధ్యక్షు డు వెంకటేష్‌ యాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంచం దర్‌ రెడ్డి, రైతుబందు మండలాధ్య క్షుడు సాయన్న, బీఆర్‌ఎస్‌ మండల యువజన విభా గం అధ్యక్షుడు కొండల్‌ రెడ్డి, సర్పంచులు మల్లయ్య, ఎంపీటీసీ బం దయ్య, దశరథ్‌ గౌడ్‌, నాయకులు రాములు, వివిధ గ్రామాల రైతుబందు గ్రామాధ్యక్షులు నాయకులు తది తరులు పాల్గొన్నారు.