30 శాతం ఐఆర్‌ ప్రకటించాలి : టీఎస్‌పీటీఏ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వేతన సవరణ సంఘం గడువు గతనెలతో ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడాన్ని టీఎస్‌పీటీఏ అధ్యక్షులు సయ్యద్‌ షౌకత్‌అలీ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఉదాసీనతను విడనాడి 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈనెల నుంచి అమయ్యేలా మంజూరు చేయాలని కోరారు. మూడు నెలల కాలవ్యవధితో నివేదిక సమర్పించేలా 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధ్యాయుల బదిలీలు ఆలస్యం అవుతున్నందున వివాదం లేని పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని కోరారు. డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.