31,401ఆర్థిక సహాయం అందించిన ఉపాధ్యాయ బృందం .. 

నవతెలంగాణ -తాడ్వాయి
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న తాడ్వాయి విద్యా వనరుల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న, సీనియర్ జర్నలిస్టు, సామాజిక రచయిత, మాతా- పితా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు సంద బాబును శుక్రవారం మండల విద్యా వనరుల కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న సంద బాబు ఇటీవల అనారోగ్యానికి గురిఅయి ములుగు హస్పటల్ వైద్యం పోందుతున్నారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం మండలంలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంఆర్సి సిబ్బంది . 31,401 శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి యాప సాంబయ్య చేతుల మీదుగా బాధితుని కి అందజేశారు. ఆయన వెంట ఉపాధ్యాయులు అల్లెం భాస్కర్, బాబురావు, నారాయణరావు, చంద్రమౌళి, పాపారావు. నరేంద్ర కుమార్, పెనక వెంకటేశ్వర్లు, కొత్త రవీందర్ ,వెంకన్న , సిఆర్పిలు కళ్యాణి, రవికుమార్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ నీలం బాబు కంప్యూటర్ ఆపరేటర్ కోగిల సారయ్యలతో పాటు ఉపాధ్యాయులు  తదితరులు ఉన్నారు.