తల్లిదండ్రులు మందలించారని ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య

నవతెలంగాణ – తాడ్వాయి
10 నాడు వచ్చిన ఇంటర్ రిజల్ట్ లో ఫెయిల్ కాగా, బాగా చదివి సప్లమెంటరీ పరీక్షలను నైనా పాస్ అవ్వాలని తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని వీరాపూర్ లో చోటుచేసుకుంది. తాడ్వాయి ఎస్‌ఐ వెంకటేశ్వరరావు  తెలిపిన వివరాల ప్రకారం.. రంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వీరాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పెనక విశ్వనాథం కు కుమారుడు ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు పెనక వివేక్ (17) అమ్మ కొండ లోని జ్యోతిరావు పూలే ఆశ్రమ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. 10 తారీకు నాడు వచ్చిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జాంలో ఫెయిల్ కావడంతో, ఇకనైనా ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల్లో బాగా కష్టపడి చదివి పాస్ కావాలని మందలించారు. దీంతో మనస్తాపానికి గురై ఈ నెల 15వ సోమవారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బీరెల్లి సర్పంచ్ జాజ చంద్రం హుటాహుటిన ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఎంజీఎం కు తరలించారు. వైద్యం పొందుతూ ఈరోజు 17వ తారీకు బుధవారం తెల్లవారుజామున 3.00 గంటలకు మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love