– లోక్‌సభలో సీపీసీబీ నివేదిక
న్యూఢిల్లీ: దేశంలోని నదుల పరిశుభ్రత, పరిరక్షణపై కేంద్రంలోని మోడీ సర్కారు నిర్లక్ష్యం వహిస్తున్నది. ఫలితం గా భారత్‌లో నదులు కలుషితమవు తున్నాయి. దేశంలో దాదాపు 46 శాతం నదులు కాలుష్య కోరల్లో చిక్కుకున్నా యి. లోక్‌సభలో ప్రవేశపెట్టబడిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం.. సీపీసీబీ 2022లో దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంత(యూటీ) లలోని 279 నదులపై 311 కలుషితమైన నదీ విస్తరణలను (పీఆర్‌ఎస్) గుర్తించింది. కాలుష్యం.. సేంద్రీయ కాలుష్య సూచిక లపై (అంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ)) నిర్ణయించబడింది. దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో అత్యధికం గా 55 పీఆర్‌ఎస్ ఉన్నది. బీహార్‌లో 18గా ఉన్నది.