వాగుపై హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి ఏడు కోట్ల 20 లక్షలు మంజూరు

నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని గోజేగావ్ గ్రామానికి వెళ్లే వాగుపై వంతెన నిర్మాణానికి అలాగే డోంగ్లి మండలంలోని మాదన్ ఇప్పర్గా గ్రామ వాగు పైన హై లెవెల్ వంచనాల నిర్మాణాల కోసం ఒక్కొక్క వంచన నిర్మాణానికి మూడు కోట్ల అరవై లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరైనట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నిధులు మంజూరైన ప్రెసిడెంట్ కాపీని విడుదల చేస్తూ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ రెండు గ్రామాల ప్రజలు దాదాపు ఏళ్ల తరబడి అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వంచనాలు లేక వర్షాకాలం వస్తే వాగులో నుండి వెళ్లలేక ప్రమాదవశాత్తు ఎందరో చనిపోయిన దాఖలాలు లేకపోలేదు ప్రస్తుతం జుక్కల్ ఎమ్మెల్యేగా హనుమంతు షిండే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ వంతెనల నిర్మాణాలకు కృషి చేస్తూ ఒక్కొక్క వంతెనకు మూడు కోట్ల 60 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయించడం ఈ నిధులతో ఆయా గ్రామాల వాగులపై హై లెవెల్ వంచనాలు పూర్తయితే వర్షాకాలం వరద నీటికి ఇబ్బందులు కలగకుండా దూరమయ్యే ఆస్కారం ఆయా గ్రామాల ప్రజలకు ఏర్పడుతుంది ఏది ఏమైనా 75 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే హనుమంతు సిండే కృషితో హై లెవెల్ వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరైనందుకు ఆయా గ్రామాల ప్రజలు సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీ జడ్పిటిసిలు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.