– సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ఈ ఏడాది రూ.700 కోట్ల లాభాల బోనస్‌ను త్వరలో చెల్లించనున్నట్టు ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. మంగళవారంనాడిక్కడి సింగరేణి భవన్‌లో స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. సంస్థ సాధించిన అభివృద్ధి, ముందున్న లక్ష్యాలను ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా మూడున్నర దశాబ్దాలుగా వివిధ ఏరియాల్లో జీఎంగా పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రస్తుత జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) ఎమ్ సురేశ్‌ను సన్మానించారు. లైజన్ అండ్ ప్రొటోకాల్ ఆఫీసర్ ఎస్.హరినాథ్, ఎన్‌సీడబ్ల్యుఏ ఉద్యోగుల తరఫున డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీమతి కరుణశ్రీ, ఆఫీస్ అటెండెంట్ కొప్పుల సాయిబాబాను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో అడ్వైజర్లు డి.ఎన్.ప్రసాద్(మైనింగ్), సురేంద్ర పాండే(ఫారెస్ట్రీ), ఈడీ(కోల్ మూమెంట్) జె.అల్విన్, జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం(మార్కెటింగ్) జి.దేవేందర్, అడ్వైజర్ (లా) లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.