– పారిపోతున్న నిందితులను వెంబడించి పట్టుకున్న అధికారులు
నవతెలంగాణ-శంషాబాద్
విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ అధికారులకు చిక్కకుండా తప్పించుకొని పారిపో వడానికి ప్రయత్నించిన ఇద్దరు ప్రయాణికులను ఆర్‌జీఐ ఎయి ర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్, ఏఐయూ హైదరాబాద్ కష్టమ్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఈ ఘటన ఆర్‌జీఐ ఎయిర్ పోర్టులో మంగళవారం జరిగిం ది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ దేశం నుంచి ఇండిగో విమానం 6ఇ – 1234 లో తెల్లవారు జామున షేక్ చాంద్ బాషా, షేఖ్ ఆరిఫ్ భాషా ఎయిర్‌పో ర్టుకు వచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు అధికారు లు వారిని తనిఖీ చేసే క్రమం లో ఆ నిందితులు తప్పించు కున్నారు. వెంటనే రంగంలోకి దిగిన సీఐడబ్ల్యూయూ సిటీ సైడ్ టీం (ఏఎస్‌జీ హైద రాబాద్) ఏఎస్‌ఐ/ఇ ఎక్స్ ఇ, సంపత్‌రావు సిటీ/జీడి బాలకృష్ణ(సీఐడ బ్ల్యు) ప్రయాణి కున్ని ట్రేస్ అవుట్ చేశారు. నిందితుడు షేక్ చాంద్ బాషా ఎయి ర్‌పోర్టులోనీ కార్ పార్కింగ్ ఏరియాలో లగేజీ లేకుండా ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అతడు అక్కడి నుంచి మరొక మరొక ప్రదేశానికి వెళ్ళినట్లుగా గుర్తించారు. డ్రైవరు పార్కింగ్ ఏరియా నుంచి మరో చోటికి లగేజితో పారిపోయాడు. చాంద్‌బాషాను పట్టుకున్న అధికారులు చాలా లోతైన పరిశోధన చేస్తే నిజం ఒప్పుకున్నాడు. కారు డ్రైవర్ వద్ద బంగారం ఉందని చెప్పాడు. కారు డ్రైవర్ మహ మ్మద్ ఆరఫ్‌ను పిలిపించారు. కారులో దాచిన బంగారం కోసం అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అందులోంచి రూ. 45 లక్షల విలువైన 700 గ్రాముల బంగారం స్వాదీనం చేస్తున్నారు. బంగారాన్ని విదేశాల నుంచి తీసుకురావ డానికి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు వారి వద్ద లేకపో వడంతో అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించారు. బంగారం స్వాధీనంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.