– కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్
న్యూఢిల్లీ: దేశంలోని న్యాయస్థానాల్లో నూ సామాజిక న్యాయం కొరవడుతు న్నది. సాక్షాత్తూ హైకోర్టులకు జరిపే జడ్జిల నియామకాల్లోనూ పెత్తందారీ కులాల ఆధిపత్యమే కొనసాగుతున్నది. 2018 నుంచి దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు జడ్జిలుగా నియమితులైనవారిలో 75 శాతానికి పైగా పెత్తందారీ కులాలకు చెం దినవారే ఉండటం గమనార్హం. ఇక ఇతర వెనుకబడిన కులాలు(ఓబీసీ) నుంచి ఈ సంఖ్య 12 శాతం కంటే తక్కువగా ఉన్నది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రి ఈ విషయాన్ని లోక్‌సభలో వెల్లడించారు. 2018 నుంచి ఈనెల 17 వరకు 604 మంది హైకోర్టు జడ్జిల నియామకం జరి గింది. ఇందులో 458 మంది జడ్జిలు జనరల్ కేటగిరివారు ఉన్నారు. ఇక 18 మంది ఎస్సీలు, 9 మంది ఎస్టీలు, 72 మంది ఓబీసీలు ఉన్నారు.
మైనారిటీ నుంచి 34 మంది కలరు. 13 మంది జడ్జిలకు సంబంధించిన సమాచారం మాత్రం అందుబాటులో లేదు.