ఘనంగా 75వ ఎబివిపి వార్షికోత్సవం..

నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ లో ఆదివారం ఏబీవీపీ అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ శివ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ చౌరస్తా వద్ద  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 75వ వార్షికోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసి అక్కడి నుండి యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్లో రక్తదాన శిబిరం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.