విమానాశ్రయంలో 836 గ్రాముల బంగారం పట్టివేత

నవతెలంగాణ-శంషాబాద్‌
విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఇద్దరు ప్రయాణికులు శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో శనివారం పట్టుబడ్డారు. మొత్తం 836 గ్రాముల బంగారాన్ని అధికా రులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారు లు తెలిపిన వివరాల ప్రకారం.. జెడ్డా నుంచి ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అనుమానంతో అతన్ని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేస్తే, రూ.19.62 లక్షల విలువైన 326 గ్రాముల బంగారం బయటపడింది. బంగారాన్ని స్వాధీనం చేసుకుని ప్రయాణికున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరో వ్యక్తి వద్ద 510 గ్రాములు
బ్యాంకాక్‌ నుంచి ఓ ప్రయాణికుడు థాయిఎయిర్వేస్‌లో విమానాశ్రయా నికి తెల్లవారుజామున చేరుకున్నాడు. కస్టమ్స్‌ అధికారులు అతన్ని తనిఖీ చేసి 510.5 గ్రాముల బంగారం ఉన్నట్టు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకొని నిందితుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగారం విలువ రూ. 30.78 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.