నవతెలంగాణ -ఇటలీ : ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఒక విమానం కూలిపోయింది. అయితే పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలిక మరణించింది. 9 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటలీలోని టురిన్‌లో ఈ సంఘటన జరిగింది. ఎయిర్‌ఫోర్స్ డే విన్యాసాల కోసం రిహార్సిల్స్ చేస్తుండగా ఒక యుద్ధ విమానంపై పైలట్ నియంత్రణ కోల్పోయాడు. అది కూలిపోతుండగా ఆ పైలట్ పారాచూట్ సహాయంతో ఆ విమానం నుంచి బయటపడ్డాడు. అనంతరం నేలపై కూలిన ఆ విమానం నుంచి మంటలు ఎగసిపడ్డాయి. కాగా, యుద్ధ విమానం కూలిన ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది. ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలిక మరణించింది. ఆమె సోదరుడైన తొమ్మిదేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే పిల్లల తల్లిదండ్రులకు, విమానం నుంచి బయటపడిన పైలట్‌కు ఏమీ కాలేదని ఆ దేశ అధికారులు తెలిపారు.