అంగన్వాడీ వర్కర్లను పర్మనెంట్‌ చేయాలి

– వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-వైరాటౌన్‌
రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు సుమారు 73000 మంది పనిచేస్తున్నారని, వీరందరూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారేనని, వెంటనే అంగన్వాడీ వర్కర్లను పర్మినెంట్‌ చేయాలని బుధవారం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అనంతరం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస జీతం నెలకు 26 వేలు ఇవ్వాలని, అంగన్వాడీ వర్కర్లను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాం కల్పించాలని తదితర పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే పీఏకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి యామాల గోపాలరావు, ఏఐటియుసి మండల కార్యదర్శి గారపాటి అశోక్‌, రాష్ట్ర నాయకురాలు లలిత, విద్య, రాజ్యం, సుమిత్ర, శ్రీదేవి, జూలూరుపాడు, వైరా ఏన్కూర్‌, కొణిజర్ల మండలాల అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.