లయన్స్‌ చేస్తున్న సేవలు అభినందనీయం

– ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ-దమ్మపేట
వైరా లయన్స్‌ క్లబ్‌ చేస్తున్న సేవలను అమోఘం అని కంటి హాస్పిటల్‌ నిర్మించి ఎంతోమంది పేదవారికి సేవలందించిన క్లబ్‌ వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం లయన్స్‌ దమ్మపేటలో కంటి పరీక్షలు కేంద్రం ప్రారంభించిన అనంతరం సభా అధ్యక్షులు ఫాస్ట్‌ జిల్లా గవర్నర్‌ డాక్టర్‌ కాపా మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్వహికులను అభినందనలు తెలియజేశారు. ఎంతోమందికి సేవలు అందించిన లయన్స్‌ క్లబ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. దమ్మపేటలో కంటి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ మండలాల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో కంటి హాస్పిటల్‌ నిర్మించి ఎంతో మందికి సేవలు అందించటం నిరుపేదలను ఆదుకోవడం పట్ల లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ కూడా ఆయన అభినందించారు. నిర్వహికులు శామ్‌ బాబు దంపతులను అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం జిల్లా గవర్నర్‌ సీహెచ్‌ శివప్రసాద్‌, ఫాస్ట్‌ జిల్లా గవర్నర్‌ దారా కృష్ణారావు, జిఎంటి కోఆర్డినేటర్‌ ఉండుృ శ్యాంబాబు, డిస్టిక్‌ క్యాబినెట్‌ సెక్రటరీ సాతులూరి సత్యనారాయణ, రీజన్‌ చైర్మన్‌ లగడపాటి ప్రభాకర్‌, జోన్‌ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, రీజన్‌ చైర్మన్‌ చలపతిరావు, డాక్టర్‌ కృష్ణ చైతన్య, దమ్మపేట సర్పంచ్‌ ఉప సర్పంచ్‌ గ్రేట్‌ విజన్‌ క్లబ్‌ అధ్యక్షులు వరలక్ష్మీ, కిషన్‌ రారు లయన్స్‌, తదితరులు పాల్గొన్నారు.