సింగరేణి ఉద్యోగుల సామాజిక సేవలు స్ఫూర్తిదాయకం

– డాక్టర్‌ శేషగిరిరావు
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి ఉద్యోగుల సామాజిక సేవలు స్ఫూర్తిదాయకమని సింగరేణి సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ శేషగిరిరావు ప్రశంసించారు. ఆదివారం సింగరేణి పదవీ విరమణ ఉద్యోగి అయితం రాజు యాదగిరి ఔదార్యం బాల వెలుగు పాఠశాల విద్యార్థులకు రూ.52 వేల విలువ గల స్కూల్‌ యూనిఫామ్‌ పంపిణీ చేశారు. తోగ్గూడెం సమ్మక్క-సారలమ్మ గద్దెల సమీపంలోని శివం ఫంక్షన్‌ హాల్‌లో మణుగూరు ఏరియా పీకే ఓసి-2 సింగరేణి పదవి విరమణ జరగింది. ఉద్యోగి అయితం రాజు-లక్ష్మీ దంపతులు సంతోష్‌ నగర్‌ బాలు వెలుగు పాఠశాల 60 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున రూ.52 వేల విలువ గల ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నిరుపేద గిరిజన విద్యార్థుల, ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం ప్రశంసనీయమని అన్నారు. సింగరేణి ఉద్యోగుల సామాజిక సేవలను ఆయన కొనియాడారు. తమకు ఏకరూప దుస్తులు అందజేసిన సందర్భంగా కృతజ్ఞతా భావంతో చిన్నారులు వేదికపై పాడిన ”బాల వెలుగు పిల్లలం చెదరని చిరునవ్వులం అనే పాట అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో యాదగిరి కుటుంబ సభ్యులు సాయిబాబు సతీష్‌ చంద్ర, పావని, కొత్త గుండ్ల రాములు, రామ కళ, సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్‌ పాషా, మంగీ లాల్‌, సహౌద్యోగులు పి.నారాయణ, బాల వెలుగు పాఠశాల నిర్వాహకులు బి.జగన్‌ మోహన్‌ రెడ్డి, సుహాసిని, దేవి లలిత, రాధా తదితరులు పాల్గొన్నారు.