మహిళా మణులతో ‘మేము సైతం-బాబు కోసం’ దీక్ష

నవతెలంగాణ-బూర్గంపాడు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులను నిరసిస్తూ మండలంలో తెలుగుదేశం, ఐటీసీ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో సారపాక సెంటర్‌లో గత 20 రోజులుగా నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం 100 పైగా మహిళలతో ”మేము సైతం బాబు కోసం” దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జోత్స్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అని, జగన్‌ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్టియుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు, ఐటీసీ టీఎన్‌టీయూసీ చైర్మెన్‌ గల్లా నాగభూషయ్య, అధ్యక్షులు కనక మేడల హరిప్రసాద్‌, తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు తాళ్లూరి జగదీశ్వరరావు, భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.