లక్షమందికి డీఎస్‌ హెల్త్‌కార్డులు

– మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌
నవతెలంగాణ -కంటేశ్వర్
లక్ష మందికి డీ. యస్ హెల్త్‌కార్డులు అందిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ ఆన్నారు. ఈ మేరకు గురువారం నగరంలోని ధర్మపురి సంజయ్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని తన నివాసంలోని ఆఫీసులో ఆధార్‌కార్డు తీసుకొని వచ్చిన వారికి డీఎస్‌ హెల్త్‌కార్డులు అందిస్తామని తెలిపారు. ప్రతి రోజు ఈ కార్డులు అందించడానికి ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ హెల్త్‌కార్డులు నగరంలోని హోప్, ఇండోస్, మెడికవర్, ప్రుడెన్స్, శ్రీకష్ణ హాస్పిటల్‌లలో ఈ కార్డులు వర్తిస్తాయని తెలిపారు. ఈ కార్డు కలిగిన వారికి హాస్పిటల్‌ ఖర్చులలో 30 శాతం రాయితీ ఇస్తారని చెప్పారు. నగర ప్రజలు ఈ అవకాశంను ఉపమోగించుకోవాలన్నారు. ఈ కార్డు అన్ని రకాల రోగాలకు వర్తిస్తుందన్నారు. మొదటి దఫాలో లక్షమందికి ఇవ్వడానికి సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం పేర్లు నమోదు చేయించుకున్న వారు సాయంత్రం వరకు కార్డును అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, కాంగ్రెస్‌ నేతలు సందీప్ సార్థ, వేంకటేశ్వర రావు, హామీద్ బిన్ గానం, సద్ధార్, బెలాల పోతన్న,  తదితరులు ఉన్నారు.