కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ..

– దేశానికి పీవీ చేసిన సేవలను మరిచిపోయి మరిపించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్
– దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన మహోన్నత వ్యక్తి పి వి
– తెలంగాణ బిడ్డ దేశానికి సేవను గుర్తించిన కేసీఆర్ శతజయంతి ఉత్సవాలు
– నిజామాబాద్ లో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-  కంటేశ్వర్
కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలను మరచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని ధ్వజమెత్తారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చి గాడిలో పెట్టిన మహోన్నత వ్యక్తి పీవీ కొనియాడారు. ఈ మేరకు సోమవారం రోజున నిజామాబాద్ లో బ్రాహ్మణ సమాజం ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని పీవీ కుమార్తె , ఎమ్మెల్సీ వాణి దేవి, కుమారుడు ప్రభాకర్ రావు తో కలిసి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ….
కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితీ లో మొత్తం కుధేలైన సందర్భంలో పీవీ నరసింహా రావు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్న బంగారం కుదవపెట్టి అన్నమోరామచంద్ర అనుకుంటున్న క్లిష్టసమయంలో ప్రధాని అయిన పీవీ కేవలం తన మేధో సంపత్తితో ఆలోచన చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని వివరించారు. ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకొని కొత్త ప్రయోగాలకు పూనుకున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్శించేందుకు ధైర్యంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆనాడు పీవీ తీసుకున్న చర్యల వల్ల ఈ రోజు లక్షలాది మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయని, కోట్లాది కుటుంబాలు దారిద్ర్య రేఖ నుంచి పైకి ఎగబాకాయన్న విషయం భారత దేశంలో ఎప్పటికీ మర్పిపోదని స్పష్టం చేశారు. కానీ అటుంవటి విషయన్ని కూడా మరిచి పోయి మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డను గుర్తించకపోతే సీఎం కేసీఆర్ పట్టుదలతో శతజయంతి ఉత్సవాలను నిర్వహించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా శతజయంతి ఉత్సవాలు జరిగాయని, పీవీ ఆలోచనా విధానాన్ని ఒక ఉద్యమంలా ప్రతీ తెలంగాణ బిడ్డ గుండెకు తట్టేలా చాటిచెబుతామని, ప్రపంచానికి పీవీ స్పూర్తిని పంచుతామని అన్నారు.పీవీ నరసింహా రావు విగ్రహం ఏర్పాటుతో నిజామాబాద్ కు కొత్త కళ వచ్చిందన్నారు. తెలంగాణ నుంచి ఎదిగి దేశానికి ఎంత సేవ చేశారో అందరికీ తెలుస్తుందని, నూతన ఉత్సాహం వస్తుందని చెప్పారు. పీవీ నరసింహా రావు అది చేశారు ఇది చేశారు అని మాట్లాడూ ఉంటే… మనం చేయాల్సిందే ఇంకా చాలా ఉంది అన్న బాధ్యతను ఈ సమావేశం గుర్తు చేసిందని అన్నారు. సహజంగా తెలంగాణ వాళ్లు చేసింది చెప్పుకోడానికి కొంత తటపటాయిస్తారని, పీవీ నరసింహా రావు కూడా అంతేనన్నారు. పీవీ 14 భాషల్లో మాట్లాడడం అంటే మామూలు మేధో సంపత్తికాదని కొనియాడారు. అంత మేధో సంపత్తి ఉన్న సరే పట్వారిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో దేశ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు అలానే ఉన్నాయన్నారు. ఆహార్యంలో కూడా ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. కొంత మంది అకస్మాత్తుగా సర్పంచ్,ఎంపీటీసీ అయినవాళ్లు గల్లా ఎగరేసి నల్లకళ్లద్దాలు పెట్టుకొని అప్పటి వరకు చెప్పులు వేసుకునే వాళ్లు షూస్ వేసుకొని అన్న అన్న అనేవాళ్లు ఏం రా అనే వరకు వస్తుంది పరిస్థితి అని సీఎం అప్పుడప్పుడు చెబుతుండేవారని చెప్పారు. పదవి వస్తే ఉప్పొంగిపోవద్దని, పదవి ఎదిగినా కొద్దీ ప్రజల తలలో నాలికలా ఉండి ప్రజల బాధలను తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ చెబుతుంటారన్నారు. పీవీ నరసింహా రావు వంటి నాయకత్వపు లక్షణాలు అందరికీ రావాలని కోరుకుంటున్నానన్నారు.కేంద్రంలో విద్యా శాఖ మంత్రిత్వ శాఖను మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖగా మార్చి అత్యద్భుతమైన కొత్త పద్ధతులను ప్రవేశపెట్టారని తెలిపారు. పీవీ నరసింహా రావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి సాంఘీక సంక్షేమ పాఠశాలలను సర్వేల్ లో ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ స్పూర్తితో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా దేశవ్యాప్తంగా నవోదయా విద్యాలయాలను పాఠశాలలను ఏర్పాటు చేశారని, దాంతో లక్షాలాది మంది మేధావులు తయారయ్యారని చెప్పారు. దేశంలో లక్షాలది మందికి తెలంగాణ బిడ్డచేత చదువు ప్రారంభమయ్యిందంటే మనందరం గర్వపడాలన్నారు.పీవీకి 65 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత దేశానికి కంప్యూటర్లు వస్తే తన కోసం, తాను పది మందికి పనికి రావడం కోసం కంప్యూటర్ వాడకాన్ని నేర్చుకున్నారని కొనియాడారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇలా ఎవ్వరిదీ చిన్న పదవి కాదని, సమాజాంలో అందరికీ పాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. నిబద్ధతతో పనిచేస్తూ పోతే కచ్చితంగా అవకాశాలు వస్తాయన్న నమ్మకంతో ముందుకుసాగితే పీవీ నరసింహా రావు స్థాయికి ఎవరైనా చేరుకుంటామన్న విశ్వాసం తనకు ఉందని ప్రకటించారు.నిజామాబాద్ జిల్లాలోని బోర్గాం (పి )చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పివినరసింహారావు కొడుకు పివి ప్రభాకర్ రావు, కూతురు ఎమ్మెల్సీ సురభి వాణి, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, బి ఆర్ యస్ నాయకులు మహేష్ బిగల , మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్ హాజరయ్యారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘ సభ్యులు వేదమం త్రాలతో పూర్ణకుంభంతో అతిథులకు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత, పివినరసిం హారావు కొడుకు పివి ప్రభాకర్, కూతురు ఎమ్మెల్సీ సురభి వాణిలు పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-05-17 05:25):

can losing 10 pounds lower NYg blood sugar | effects of green tea O6m on blood sugar | 250 blood sugar in mmol CPd | iGI fasting blood sugar reading 126 | what causes your blood 515 sugar to be high | 3VT blood sugar stabilizing smoothie | what happens OPD during low blood sugar | why would blood sugar go down after u04 eating | can smoking raise SCM your blood sugar | blood sugar 45O eating chart | female age 65 morning blood rH5 sugar 160 | very low blood sugar when MJ9 water fasting | blood sugar levels meaning Icz | elevated blood SRx sugar with drowning | does rum Jyd raise your blood sugar | blood Qzl test sugar level 500 | hgba1c average UHG of blood suger for 90 days | blood sugar 400 hospital q07 | dYl blood sugar in the morning | what is the normal range for blood VyQ sugar reading | can yM8 alcohol consumption raise blood sugar | food combining kLa and blood sugar | blood sugar zY9 130 3 hours after meal | blood sugar low fij in dogs | what hCD my blood sugar | 146 blood n4r sugar before meal | blood sMy sugar 163 one hour after eating | high vL1 blood sugar alcohol breath | phone D4S app to check blood sugar | what does a high fasting blood sugar Ou0 mean | tdk blood sugar 30 minutes after eating | low blood CGp sugar cause numbness | does cat claw lower blood sugar lkB | blood sugar random normal range Nqy | normal hba1c cbc blood sugar jw1 levels | low blood sugar sympathetic OKA nervous system insulin | how much should your blood n9J sugar be after eating | quickest way XoW to lower my blood sugar | type 2 diabetes target blood sugar mVn levels | 10 ways to lower your NHu blood sugar | blood PhL sugar levels and immune system | natural ways to 6yj reduce blood sugar level | foods that don A3V t raise blood sugar | what to do rOx if blood sugar keeps going up | blood sugar levels to low GQT | blood sugar anxiety 96 | when to go to hospital high blood sugar X5A | bring high blood sugar down 9OJ quickly | is low blood sugar reversible lUd | qgy watch monitors blood sugar