అభివృద్ధి, సంక్షేమానికే అధిక ప్రాధాన్యత

– ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ -బూర్గంపాడు
బూర్గంపాడు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని, అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.ఆదివారం లక్ష్మీపురం పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్ల వ్యయంతో లక్ష్మీపురం నుంచి టేకుల చెరువు వరకు గల సిసి రోడ్డు ప్రారంభోత్సవం, రూ.1.5 కోట్ల వ్యయంతో డ్రైన్‌ ప్రారంభోత్సవం, 15 లక్షల వ్యయం తో బస్సు షెల్టర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పినపాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తు న్నారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పినపాక నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కోట్లాది రూపాయలు నిధులను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ పిఎస్పీడీ యూనిటీ హెడ్‌ సిధార్థ మొహంతి, ఐటిసి పిఎస్పిడి హెచ్‌ఆర్‌ జియం శ్యామ్‌ కిరణ్‌ , మేనే జర్‌ చెంగలరావు, బూర్గంపాడు జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి, పిఎసిఏస్‌ చైర్మన్‌ బిక్కసాని శ్రీనివాసరావు, పార్టీ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జలగం జగదీష్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ యువజన విభాగ మండల అధ్యక్షుడు గోనెల నాని, సర్పంచ్‌ సోంపాక నాగమణి, గ్రామ కమిటీ అధ్యక్షులు పోతిరెడ్డి గోవిందరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆవుల రామాంజిరెడ్డి, మాజీ సర్పంచ్‌ గద్దల ప్రకాష్‌, వార్డు మెంబర్లు పాలెం దివాకర్‌ రెడ్డి, తాటి శ్రీను, బందెల వెంకటే శ్వర్లు, తోకల రమణ, కత్తి రమణ, బాదం పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు.