నవతెలంగాణ- ఖమ్మం
నగరంలోని హార్వెస్ట్ స్ప్రింగ్ పాఠశాలలో శుక్రవారం ‘ది జాయ్ ఆఫ్ గివింగ్’ అనే కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో నిర్వహించారు. విద్యార్థులు అందరూ తమకు తోచిన విధంగా వారి ఇంటి నుండి కొన్ని బియ్యం తీసుకుని వచ్చి అనాధాశ్రమంలో అందజేశారు. పిల్లల్లో దానగుణం సేవా భావాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని హార్వెస్ట్ హార్వెస్ట్ స్ప్రింగ్ హెచ్ఎం ఎం.పీ.రాజన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైనందిన జీవితంలో అనాధలు ఎదుర్కొంటున్న స్థితిగతులను, సమస్యలను ప్రత్యక్షంగా చూసి వారిలో సేవాభావం పెంపొందించాలని, ఆలోచనతో అనాధ ఆశ్రమాలకు వెళ్లి ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, విద్యార్థిని, విద్యార్థులు అందరూ ఎంతో ఉత్సాహంగా, అదేవిధంగా బతుకమ్మ సంబరాలను కూడా స్ప్రింగ్ పాఠశాల మైదానంలో ఎంతో కోలాహలంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల నడుమ హార్వెస్ట్ స్ప్రింగ్ లీఫ్ యాజమాన్యం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు వారి ఇంటి నుండి తీసుకుని వచ్చిన పూల తోటి అదే విధంగా పాఠశాల వారు ఏర్పాటు చేసిన పూలతోటి వివిధ రకాల సైజులలో బతుకమ్మను పేర్చి వివిధ రకాల బతుకమ్మ పాటలు పాడి ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రీతి, చందన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.