చర్మ సంరక్షణకు…

For skin care...చాలామంది మహిళలు తమ చర్మ రక్షణ గురించి పట్టించుకోరు. దీనితో ముడతలు, మచ్చలు ఏర్పడి చిన్న వయసులోనే వద్ధుల్లా కనబడతారు. లుక్‌ మారిపోయిన తర్వాత కసరత్తు చేసి ఆరోగ్యంగా కనబడాలని ప్రయ త్నిస్తారు. అలా కాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే చర్మం పట్టులా మెరిసి పోతుంది. మరీ ముఖ్యంగా ఈ కింది నూనెలను ఉప యోగిస్తుంటే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
బాదం నూనె : విటమిన్‌ ఇ, కె అధికంగా ఉండే బాదం నూనె చర్మాన్ని మెరుగుపరుస్తుంది. మెరుగైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని చైతన్యం చేయడమే కాకుండా మదువుగా చేయడానికి సహాయపడుతుంది. తద్వారా రంగు, స్కిన్‌ టోన్‌ మెరుగుపడుతుంది. బాదం నూనె రాసుకోవడం వల్ల సూర్యరశ్మి చర్మాన్ని దెబ్బ తీయ కుండా నిరోధించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. స్నానం చేసిన తర్వాత బాదం నూనెతో చర్మాన్ని మసాజ్‌ చేయండి. వద్ధాప్య ఛాయలు దరిచేరకుండా వుండా లంటే ప్రతిరోజూ ఇలా చేయండి.
వేప ఎసెన్షియల్‌ ఆయిల్‌ : ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలున్నాయి. ఇవి చర్మ వద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంతో పాటు చర్మ వ్యాధులను నివారించగలవు. వేప నూనెలో పాలీఅన్‌శాచురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలు, విటమిన్‌ ఇ ఉన్నాయి. కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని అతినీల లోహిత వికి రణం నుండి రక్షిస్తాయి. విటమిన్‌ ఇ చర్మంపై మచ్చలు, ముడతలు కనిపించడాన్ని తగ్గిస్తుంది. పావు కప్పు గోరు వెచ్చని ఆలివ్‌ లేదా కొబ్బరి నూనెలో టేబుల్‌ స్పూన్‌ వేప ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలపాలి. పడుకునే ముందు వత్తాకార కదలికలలో ఐదు నిమిషాలు ఈ మిశ్రమంతో మీ చర్మాన్ని మసాజ్‌ చేసి రాత్రిపూట వదిలివేయండి. మీరు దీన్ని రోజూ చేయవచ్చు.
ఆలివ్‌ నూనె : ఈ నూనెలో విటమిన్‌ ఎ, ఇతో పాటు అనేక ఇతర ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి మన చర్మంలోని ప్రధాన బిల్డింగ్‌ బ్లాకులలో ఒకటైన కొల్లాజెన్‌ అనే ప్రోటీన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. స్నానం చేసే ముందు రోజూ ఐదు నుండి పది నిమిషాలు మీ శరీరాన్ని గోరు వెచ్చని ఆలివ్‌ నూనెతో మసాజ్‌ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. వద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
కొబ్బరి నూనె : కొబ్బరి నూనె కొల్లాజెన్‌ ఉత్పత్తికి దోహదం చేయడం వల్ల ముడతలు, మచ్చలు వంటి వద్ధాప్య సంకేతాలకు వ్యతిరేకంగా పని చేస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలను కలిగి ఉంది. కొబ్బరి నూనెలోని లారిక్‌ ఆమ్లం యాంటీ బాక్టీరియల్‌ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మొటిమల బ్రేక్‌ అవుట్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెను పొడి చర్మం, తామర, సోరియాసిస్‌ చికిత్సకు ఒక ప్రసిద్ధ సహజ ఔషధంగా ఉపయోగిస్తారు.