
నవతెలంగాణ-బోధన్ టౌన్ : బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి శరత్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్ నగరంలో సోమవారం పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కండవను ధరించారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోశాధికారి పి. సుదర్శన్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండవాను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.