జోనల్ స్థాయి క్రీడాపోటీలలో.. ధర్మారం క్రీడాకారుల ప్రభంజనం

నవతెలంగాణ- డిచ్ పల్లి: తెలంగాణ సాంఘిక సంక్షేమ  గురుకుల విద్యా సంస్థ నిర్వహిస్తున్న జోనల్ స్థాయి క్రీడాపోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆరు ట్రోఫిలను  డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బి గురుకుల పాఠశాల కైవసం చేసుకుంది. బాసర జోన్ పరిధిలోని నిజామాబాద్, అదిలాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన జోనల్ స్థాయి క్రీడా పోటీలు 13 నుండి 16 వరకు నిర్మల్ జిల్లాలోని లెఫ్ట్ పోచంపాడు లో నిర్వహించారు. ఇందులో 14  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థినిలు  పాల్గొన్నారు. అందులో U/14 విభాగం లో గేమ్స్ ఓవరాల్ ఛాంపియన్ షిప్, U/17 విభాగం లో గేమ్స్ ఓవరాల్ ఛాంపియన్ షిప్,అథ్లెటిక్స్  ఇండి విజువల్ ఛాంపియన్ షిప్, అథ్లెటిక్ ఓవర్ ఆల్ ఛాంపియన్ షిప్ మరియు U/19 విభాగం లో గేమ్స్ ఓవర్ ఆల్ ఛాంపియన్ షిప్, అథ్లెటిక్స్ ఓవర్ ఆల్ ఛాంపియన్ షిప్ ట్రో ఫిలను కైవసం చేసుకున్న సందర్భంలో వ్యాయామ అధ్యాపకురాలు నీరజ ను, వ్యాయమ ఉపాధ్యాయు రాలు జ్యోత్సను క్రీడా కారినులను సిఓఈ ధర్మారం బి పాఠశాల ప్రిన్సిపల్  సంగీత, నిజామాబాద్ ప్రాంతీయ  సమన్వయ కర్త అలివేలు ప్రత్యేకంగా అభినందించారు. జోనల్ స్థాయి పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులు  రాష్ట్ర స్థాయి లో జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు.