నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టాపన 

నవతెలంగాణ- కమ్మర్ పల్లి
మండల కేంద్రం శివారులోని పెద్దగుట్ట వద్ద నూతనంగా నిర్మించిన నరసింహ స్వామి ముఖద్వారం కమాన్ పైన నరసింహ స్వామి విగ్రహం ప్రతిష్టపన కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని నరసింహస్వామి ఆలయం నుండి దప్పు వాయిద్యాలతో పెద్దగుట్ట కమాన్ వరకు నరసింహ స్వామి విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కమాన్ మధ్యలో నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం స్వామి, బిఆర్ఎస్ పార్టీ రైతు విభాగం మండల అధ్యక్షుడు బద్దం రాజశేఖర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అంగిరేకుల  మల్లేష్, రాజన్న, దశరథ్, నరసయ్య, రాజేశ్వర్, నాగరాజు, గణేష్, నర్సారెడ్డి, హనుమంతు, సాయిరాం, అంకిత్,గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.