– తెలంగాణ రాష్ట్రానికే తలమానికం ఇక్కడి ఆయిల్ ఫాం పరిశ్రమలు….
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గాలు పునర్విభజనలో భాగంగా 2009 ఏర్పడిన నియోజక వర్గం గిరిజన ప్రాంతం అయినప్పటికీ రాజకీయంగా, వ్యవసాయం, పారిశ్రామికీకరణ పరంగా మైదానం, పట్టణ నియోజక వర్గాలతో పోటి పడుతుండటం గర్వించదగిన అంశం. భౌగోళికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో గల ఈ నియోజక వర్గంలో వ్యవసాయ యాంత్రీకరణ,సాగులో నీటి వృధా అరికట్టడంలో బిందు సేద్య పరికరాలు వినియోగం ఈ ప్రాంతం రైతులకు కొట్టిన పిండే అని చెప్పాలి. ఈ నియోజక వర్గంలో ఉద్యాన పంటలు అయిన కొబ్బరి, మామిడి, జీడిమామిడి, ఆయిల్ ఫాం, వీటిల్లో అంతర్ పంటగా కోకో సాగుచేస్తారు. అరటి, కూరగాయలు ఆయా రుతువులు వారీగా పండించడం ఈ ప్రాంతం రైతులకు పరిపాటి. అశ్వారావుపేట మండలంలో ఆయిల్‌ఫెడ్ కు చెందిన కేంద్రీయ నర్సరీ,ఫాం ఆయిల్ పరిశ్రమ, దమ్మపేట మండలం అప్పారావుపేట లో మరో ఆయిల్ ఫాం పరిశ్రమలు రాష్ట్రానికే తలమానికంగా ఉన్నాయి. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో వ్యవసాయ ఉత్పత్తులతో ముడి కాగితం తయారు చేసే శ్రీ లక్ష్మీ తులసి ఆగ్రో పేపరు బోర్డ్( ప్రయివేట్ )లిమిటెడ్ నెలకొంది. ఇక్కడనే ఔషద మొక్కలు తో ముడి ఔషధాలు తయారు చేసే కెమిలాయిడ్స్,హెర్బెక్ష్ లాంటి పరిశ్రమలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని రకాలు ఉద్యాన పంటలు మొత్తం 1 లక్ష 60 వెల 599 ఎకరాలు సాగులో ఉండగా అశ్వారావుపేట నియోజక వర్గంలోని అయిదు మండలాల్లో నే 1 లక్ష 12 వేల 754 ఎకరాలు సాగులో ఉండటం విశేషం.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న ఆయిల్ ఫాం పంటకు అశ్వారావుపేట జీవనాడి అంటే అతిశయోక్తి కాదు.ఈ పంట 1992 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు అశ్వారావుపేట ప్రాంతం లో ఈ పంటను ప్రారంభించడం చారిత్రిక సత్యం.
మండలం ఉద్యాన పంటలు ఎకరాల్లో
అన్నపురెడ్డిపల్లి 5817
అశ్వారావుపేట 35758
చండ్రుగొండ 6867
దమ్మపేట 49733
ములకలపల్లి 14579
నియోజక వర్గం మొత్తం 1,12,754
ఆల్లపల్లి 678
అశ్వాపురం 1403
భద్రాచలం 461
భూర్గంపాడ్ 2686
చర్ల 1007
చుంచుపల్లి 541
దుమ్మగూడెం 1676
గుండాల 218
జులూర్ పాడ్ 7879
కరకగూడెం 170
కొత్తగూడెం 78
లక్ష్మీదేవిపల్లి 4621
మణుగూరు 487
పాల్వంచ 5218
పినపాక 924
సుజాత నగర్ 3840
టేకులపల్లి 12073
ఇల్లందు 3877
మిగతా నియోజక వర్గాల మొత్తం 47845
జిల్లా మొత్తం 1,60,599