నవతెలంగాణ- మధిర
నిధులు కేటాయించి ఎస్‌సి, ఎస్‌టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్4న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి మధిరలో కరపత్రాలను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యకాస జిల్లా నాయకులు తేలుప్రోలు రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సి, ఎస్టిలపై జరుగుతున్న దాడులను, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయాలని, ఉపాధి హామీ చట్టాలను పట్టణాలలో అమలు చేయాలని, రోజు కనీస వేతనం 600 ఇవ్వాలని డిమండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రడపంగి జయ ప్రసాద్, ఆర్ స్వామీ, బి.చింటూ, ప్రభాకర్, శ్రీనివాసరావు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.