మనం చేసే ఎక్సర్‌సైజ్‌లలో చాలా వరకు మన శరీరం, కండరాలు, కీళ్లను బలంగా చేసేవే. ఇందు కోసం జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల సాధారణ వ్యాయామాలు… మన ఫిట్‌నెస్ పెంచడంతోపాటూ అందాన్ని కూడా ఇనుమడింపజేస్తాయి.
వేగంగా నడవడాన్ని బ్రిస్క్ వాకింగ్ అంటారు. సాధారణంగా మనం రోజూ నడిచేది క్యాజువల్ వాకింగ్. అలా నడిస్తే శరీరంలో కొవ్వు కరుగుతుందే తప్ప అద్భుతమైన ప్రయోజనాలేవీ కనిపించవు. అదే బ్రిస్క్ వాకింగ్ చేస్తే మాత్రం ముఖంలో కాంతి పెరుగుతుంది. చర్మకాంతి మెరుగవుతుంది. ఇందుకు కారణం ఏంటన్నదానిపై సైంటిస్టులు పరిశోధిస్తున్నారు.
మనం వేగంగా నడుస్తున్నప్పుడు మన గుండె వేగంగా పనిచేస్తుంది. ఫలితంగా రక్త సరఫరా మెరుగవుతుంది. గుండె, రక్తానికి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అందుతుంది. ఈ ప్రక్రియ వల్ల స్కిన్ మెరుస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉన్నంతకాలం చర్మం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ట్రెడ్‌మిల్‌పై 30 నిమిషాలు పరిగెత్తడం వల్ల విడుదలయ్యే రసాయనాల వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. సెరెటోనిన్, డాపోమైన్ ఉత్పత్తి వల్ల మెదడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది.
ఎక్సర్‌సైజ్ వల్ల మీకు చెమట పడితే మంచిదే. శరీరంలో చెడు బయటకు వచ్చేస్తుంది. రోజూ కాసేపు ఎక్సర్‌సైజ్ చెయ్యడం వల్ల తలపై ఉండే చర్మంలో రక్త సరఫరా పెరుగుతుంది. ఫలితంగా జుట్టు బలంగా పెరుగుతుంది. మరింత అందమైన జుట్టు మీ సొంతమవుతుంది. ఆక్సిజన్‌తో కూడిన రక్తం జుట్టుకి యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ స్ట్రెస్ తగ్గించి జుట్టును బలంగా చేస్తుంది.
రిలాక్సేషన్ ఎక్సర్‌సైజ్ ప్రభావం ముఖంపై త్వరగా కనిపిస్తుంది. ఎక్కువగా ఊపిరి పీల్చుకోవడం వల్ల… అనులోమ్, ఆంటోనీమ్స్ వంటివి లంగ్స్‌కి చేరతాయి. అవి కండరాల్ని బలోపేతం చేస్తాయి. రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి.