నవతెలంగాణ-నేలకొండపల్లి
మున్నూరు కాపు సంఘం నేలకొండపల్లి పట్టణ అధ్యక్షుడిగా కందికొండ సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నేలకొండపల్లి పట్టణ మున్నూరు కాపు సంఘం సమావేశం స్థానిక గౌతమి పాఠశాలలో సాగి నాగేశ్వరరావు అద్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మారిశెట్టి వెంకటేశ్వరరావు, కనపర్తి నాగేంద్రరావు, ఆకుల వెంకయ్య, మానుకొండ దుర్గారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు కాపులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. మున్నూరు కాపులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని తద్వారా సమాజాభివృద్ధిలో కీలక భూమిక పోషించాలన్నారు. రానున్న కాలంలో మున్నూరు కాపు సంఘాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. అనంతరం నేలకొండపల్లి పట్టణ మున్నూరుకాపు సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడుగా గుండా బ్రహ్మం, ప్రధాన కార్యదర్శిగా బ్రమ్మారపు ఉదరు భాస్కర్, సహాయ కార్యదర్శిగా తోట నరసింహారావు, కమిటీ సభ్యులుగా ఏనుగుల శ్రీను, చిట్టెంశెట్టి వెంకటేశ్వర్లు, కందికొండ సాయివితేష్, చిట్టెంశెట్టి ఉదరు భాస్కర్. ట్రెజరీగా తోట భాను, యూత్ పట్టణ అధ్యక్షుడుగా మర్రి శివలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో బాజా నాగేశ్వరరావు, కందికొండ శ్రీను, తోట శ్రీను, చిట్టెంశెట్టి రాంబాబు, బాజా రామకృష్ణ, చెన్నంశెట్టి రాంబాబు, జంగిలి శ్రీను, బాజా నాగభూషణం, జంగిలి శేఖర్, కనపర్తి నాగేశ్వరరావు, నున్నా నరసింహారావు, మిట్టపల్లి వెంకటరమణ, ముళ్ళంగి వెంకటేష్, పసుపులేటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.