మర్శకట్ల పెద్దశౌరి కుటుంబానికి సీపీఐ(ఎం) పరామర్శ

కల్లూరు: మండల పరిధిలోని తాళ్లూరు వెంకటాపురం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు మర్శకట్ల పెద్ద శౌరి ఇటీవల మృతి చెందారు. ఆదివారం సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తాత భాస్కర్‌రావు శౌరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాత భాస్కర్‌ రావ్ను మాట్లాడుతూ పెద్దశౌరి సీపీఐ(ఎం) ఎనలేని సేవలను అందించారని, ఆయన లేని లోటు తీరనిదన్నారు. అనంతరం శౌరి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి మాదల వెంకటేశ్వరరావు, రైతు సంఘం మండల కార్యదర్శి అంజయ్య , వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మోదుగు వెంకయ్య ,తాళ్లూరు కార్యదర్శి నాయుడు చందర్రావు, వెంకటాపురం కార్యదర్శి సొంబత్తిని కృష్ణ, ప్రకాశం, మర్శకట్ల చిన్న దర్గయ్య మర్శకట్ల డేవిడ్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.