వామపక్ష అభ్యర్ధులను గెలిపించండి

– బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ లను ఓడించండి
– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు వెంకట్‌ పిలుపు
నవతెలంగాణ-అశ్వారావుపేట
లౌకిక తత్వం బతకాలన్నా, భారత రాజ్యాంగాన్ని కాపాడలన్న, ప్రజా ధనం ప్రైవేట్‌, కార్పోరేట్‌ శక్తుల పరం కాకుండా ఉండాలన్నా పార్లమెంట్‌, అసెంబ్లీలో వామపక్షాల బలం పెరగడంతోనే సాధ్యమవుతుంది అని, అందుకోసం సీపీఐ(ఎం), సిపిఐ అభ్యర్ధులు పోటీలో ఉన్న చోట మతోన్మాద, ప్రైవేటీకరణ, బూర్జువా పార్టీలు అయిన బిజేపి, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులను ఓడించి వామపక్ష అభ్యర్ధులకు గెలిపించాలని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ మండల కమిటీ ఆద్వర్యం లో సోమవారం స్థానిక సుందరయ్య భవన్‌లో మండల కార్యదర్శి చిరంజీవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఐ(ఎం) ఒంటరి పోటీకి ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌ బాధ్యత వహించాలన్నారు. మా పార్టీ శాసన సభల్లో మా ప్రాతినిధ్యం పెంచడం ద్వారా ప్రజల తరుపున పోరాడటం, బీజేపిని ఓడించడం మే లక్ష్యం అని తెలిపారు. సిపిఐ పోటీ చేసే స్థానాల్లో సహకరిస్తామన్నారు. తెలంగాణలో బీజేపి తన ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా అమలు చేయడానికి పన్నాగం పన్నుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అదాని, అంబాని కంపెనీలకు వనరులను దారాదత్తం చేస్తుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సిపిఐ(ఎం) ఏడు స్థానాల్లో పోటీ చేస్తుందని, ఈ నెల 8 న భద్రాచలంలో, 9న అశ్వారావుపేట, పాలేరు, ఖమ్మం, సత్తుపల్లిలో నామినేషన్‌ వేస్తున్నామని తెలిపారు. అశ్వారావుపేట అభ్యర్ధి పిట్టల అర్జున్‌ను వందలాది ప్రజా సంఘాలు బలపరుస్తున్నాయి అని, వామపక్ష అభ్యర్ధులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు, నియోజక వర్గం కన్వీనర్‌ కొక్కెరపాటి పుల్లయ్య, ఎమ్మెల్యే అభ్యర్ధి పిట్టల అర్జున్‌, మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు, సి.హెచ్‌ సీతారామయ్య లు పాల్గొన్నారు.