– 8న సత్తుపల్లి, 9న పాలేరు, ఖమ్మం, 10న మధిర, వైరా
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోనూ సీపీఐ(ఎం) అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వారు 8, 9, 10 తేదీల్లో నామినేషన్లు వేస్తున్నారని, ఈ సందర్భంగా వేలాది మందితో ప్రదర్శన, ర్యాలీలు నిర్వహిస్తున్నామని, వీటికి పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. నవంబర్ 8న సత్తుపల్లి నియోజకవర్గానికి మాచర్ల భారతి, 9న పాలేరు నియోజకవర్గానికి తమ్మినేని వీరభద్రం, ఖమ్మం నియోజకవర్గానికి యర్రా శ్రీకాంత్, 10న మధిర నియోజకవర్గానికి పాలడుగు భాస్కర్, వైరా నియోజకవర్గానికి భుక్యా వీరభద్రం నామినేషన్ వేస్తారని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, ఎస్.వీరయ్య, చుక్క రాములు, సిఐటియు జాతీయ నాయకులు ఎం.సాయిబాబులు హాజరవుతున్నారని, ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.